Allu – Mega: మళ్ళీ అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య చిచ్చు మొదలైందా.. ఇదిగో ప్రూఫ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా , అల్లు ఫ్యామిలీ లకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఉండే బడా ఫ్యామిలీలలో ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా అల్లు రామలింగయ్య కారణంగా అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు లభిస్తే.. చిరంజీవి కారణంగా మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ రెండు కుటుంబాల మధ్య బాంధవ్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అల్లు వారింటికి చిరంజీవి అల్లుడుగా వెళ్లారు. ఇక అప్పటినుంచి ఈ రెండు కుటుంబాలు ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగులు వేస్తూ ఇండస్ట్రీలో నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య కారు చిచ్చు మొదలైందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ మాట్లాడకపోవడం.. అలాగే మెగా ఈవెంట్లలో అల్లు వారు కలవకపోవడం లాంటి కారణాలవల్ల వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలకు చెక్ పెట్టాడు అల్లు అరవింద్.. అల్లు అరవింద్, చిరంజీవి కలసి అల్లు రామలింగయ్య స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు సద్దుమణిగాయని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకు కారణం ఇదే అంటూ కొన్ని కారణాలను కూడా నెటిజన్లు చూపిస్తున్నారు.

అసలు విషయంలోకెళితే.. అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాదు ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాసాయి. అయితే ఈమధ్య అల్లు అరవింద్ కి, చిరంజీవికి మధ్య అసలు పడడం లేదనే విషయం మళ్ళీ వైరల్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న చేష్టలు చేస్తుంటే చిరంజీవికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లందరితో అల్లు అరవింద్ కలిసి తిరుగుతున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని చూసిన అభిమానులందరికీ కూడా అల్లు అరవింద్ చిరంజీవికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అంటూ వాపోతున్నారు.

- Advertisement -

ఇక అందులో భాగంగానే బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో చేయిస్తున్నారు అంటూ పలు రకాల వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి బాలయ్యకి, చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవు కానీ సినిమాలపరంగా విభేదాలు ఉండడంతో అల్లుఅరవింద్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణతో అల్లుఅరవింద్ క్లోజ్ గా మూవ్ అవడమే ఇందుకు నిదర్శనమని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు