IFFI Goa 2023: విజేత‌ల‌కు భారీ న‌గ‌దుతో పాటు ఇచ్చే బ‌హుమ‌తులు ఇవే..!

సినిమా రంగంలో రానిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు వారికి అవార్డులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 1952 నుండి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ ఇండియా అవార్డులను అందిస్తోంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NFDC), భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఈ అవార్డుల కోసం మేకర్స్ తమ సినిమాలను పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది IFFI GOA 2023 వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

న‌వంబ‌ర్ 20న ప్రారంభ‌మైన‌ వేడుక‌లు వారంరోజుల పాటు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఫిల్మ్ షెస్టివెల్ లో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన సినిమాల‌కు అవార్డులు ప్ర‌ధానం చేస్తారు. గెలిచిన విజేత‌ల‌కు భారీ న‌గ‌దులో పాటు ఆక‌ర్షణీయ‌మైన బ‌హుమ‌తులు కూడా అంద‌జేస్తారు. ఉత్త‌మ‌చిత్రం అవార్డుగా గెలుచుకున్న విజేత‌ల‌కు రూ.40ల‌క్ష‌లు అంద‌జేస్తారు. ఈ నగదును డైరెక్టర్, నిర్మాత సమానంగా పంచుకోవాలి.

దీంతో పాటు డైరెక్టర్‌కి గోల్డెన్ పీకాక్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉత్తమ నటుడికి రూ.10లక్షల బహుమతి, సిల్వర్ నెమలి అందజేస్తారు. దీంతో పాటు సర్టిఫికెట్ అందజేస్తారు. ఉత్తమ నటికి సైతం రూ.10లక్షల బహుమతి, సిల్వర్ నెమలితో పాటు సర్టిఫికెట్ అందజేస్తారు. స్పెషల్ జ్యూరీ అవార్డు కింద చలన చిత్రానికి రూ.15లక్షల నగదు, రజత నెమలి, సర్టిఫికేట్ అందజేస్తారు.

- Advertisement -

ఏ సినిమాకు అవార్డు వచ్చినా అది దర్శకుడిగా చెందుతుంది. కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు వారికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును కూడా ఇస్తారు. ఈ అవార్డుకు ఎంపికైన వారికి రూ.10లక్షల నగదు అందజేస్తారు. ఇక ఈ పోటీకి వచ్చే సినిమాలకు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. సినిమాలకు ఖచ్చితంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు