Project K: నాగ్ అశ్విన్ పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమా గురించి తరచూ ఏదో ఒక అప్డేట్ వినపడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ ఒక ఇంపార్టెంట్ రోల్ నటించనున్నాడు. ఇటీవల కమల్ హాసన్ ఇందులో విలన్ రోల్ లో నటిస్తున్నాడన్న అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అమితాబ్, కమల్ పాత్రలతోనే ప్రాజెక్ట్ కె స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రాజెక్ట్ కె సినిమా యూనిట్ ఫాలో అవుతున్న ప్రమోషన్ స్ట్రాటజీ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్ట్ టీ – షర్ట్స్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమ్మకానికి పెట్టింది సినిమా యూనిట్. ఈ సేల్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ట్రెమండస్ రెస్పాన్స్ రావటంతో నాలుగు నిమిషాల్లోనే సైట్ క్రాష్ అవ్వటం స్టాక్ అయిపోవటం జరిగింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా ఇదే రిపీట్ అవటంతో అభిమానులు అసహనానికి గురవుతున్నారు. అసలు తీ షర్ట్స్ నిజంగా అమ్ముతున్నారా లేక పబ్లిసిటి స్టంట్ చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు.

- Advertisement -

పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఫాలో అవ్వటం మంచిదే కానీ, ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందని తెలిసినప్పుడు ఎఫిషియెంట్ గా సర్వర్స్ ని మెయింటైన్ చేసి టీషర్ట్స్ ఎక్కువ మంది ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా చేసుంటే సినిమాకి మంచి ప్రమోషన్స్ అయ్యుండేది. మరి, ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు నాగ్ అశ్విన్ ఏ ప్లాన్ తో ముందుకొస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు