NANI 30: న్యాచురల్ స్టార్ సినిమాకు మెగా స్టార్ ఓల్డ్ టైటిల్ ?

వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మాణంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా గురించి అందరికి తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాని30 గా పిలవబడుతున్న ఈ సినిమా టైటిల్ కు క్లారిటీ తొందర్లోనే రాబోతుంది.

డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాను మెగా స్టార్ట్ చిరంజీవి ఓల్డ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ను పెట్టనున్నట్టు టాక్. గతంలో కూడా నాని మెగా స్టార్ట్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకొని సూపర్ హిట్ కొట్టగా, ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవబోతున్నాడు. మలయాళం సూపర్ హిట్ హృదయం సినిమాకు సంగీతం అందించిన హేషం అబ్దుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.

గతంలో నాని నటించిన జెర్సీ సినిమా తరహాలో ఈ సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుండటంతో ఈ సినిమాకు డాడీ అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వారాంతం లోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే డాడీ టైటిల్ తో పాటు హలో నాన్న, హాయ్ నాన్న అనే టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నారట. మరీ వీటిలో ఏ టైటిల్ ను కన్ఫామ్ చేస్తారనేది క్లారిటీ గా చెప్పలేం. దసరా సినిమాతో తనలోని మాస్ అవతార్ ఆవిష్కరించిన నాని , ప్రస్తుతం రాబోయే సినిమాతో మరోసారి తన ఎమోషనల్ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు