VS11: విశ్వక్ సేన్ కొత్త సినిమాలో హీరోయిన్ గా DJ టిల్లు భామ?

దాస్ కా ధమ్కీ సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా రిలీజ్ అయి నెల కుడా కాలేదు, అప్పుడే మరో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఛల్ మోహన రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమా కు మ్యూజిక్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షురూ కానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇప్పుడు మూవీ మేకర్స్ టీమ్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా dj టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుందంటూ, అంతే కాదు మరో హీరోయిన్ గా అంజలి కూడా నటించనుందంటూ గాస్సిప్స్ వినబడుతున్నాయి. dj టిల్లు తర్వాత తెలుగులో చాలా మందికి క్రష్ అయింది నేహా శెట్టి. విశ్వక్‌ సేన్‌ మరోవైపు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న గామి చిత్రంలో కూడా నటిస్తున్నాడు. గామి సినిమా తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు.

ఇటు నేహా శెట్టి కి dj టిల్లు తర్వాత పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. ప్రస్తుతం బెదురు లంక అనే సినిమా లో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ విడుదలకు సిధ్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే నేహా శెట్టి కి చాలా ప్లస్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు