UGRAM : నాంది డైరెక్టర్ కొత్త సినిమా షూటింగ్ కంప్లిట్

“అల్లరి”నరేష్, తన పేరులోని అల్లరిని పక్కన పెట్టి సీరియస్ ఫిలిమ్స్ పై దృష్టి సారించారు. గతంలో కామెడీ సినిమాలకే పరిమితం అయినా అయన, తన పంథా మార్చుకున్నారు.”నాంది” సినిమాతో తన కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత హిట్ ని చూసిన అల్లరి నరేష్, కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నాంది తరువాత అయన “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే చిత్రంలో నటించారు . ట్రైబల్ విలేజ్ సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ప్రస్తుతం ఆయన “ఉగ్రం” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఎగ్రెసివ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ జోలికి వెళ్తే అతను ఎంత దూరం వెళ్తాడు. అనే ఇతివృత్తంగా విజయ్ కనకమేడల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నరేష్ షార్ట్ హెయిర్ తో ఉండే లుక్ మరియు, పోలీస్ ఆఫీసర్ గెటప్ లలో కనిపించబోతున్నారు. నాంది తరువాత విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడం తో ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పార్ట్ యూనిట్ నిన్నటితో కంప్లిట్ చేసారు. నరేష్ కి జోడిగా మిర్నాలిని రవి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లోనే హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మే 5 ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు