Nayanthara : ఆ స్టార్ హీరో డైరెక్షన్ లో నయన్.. నిర్ణయం సరైందేనా..?

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా అప్డేట్ ల పై ఒక తాజా వార్త వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతోంది అంటూ ఒక వార్త తెరపైకి రాగా .ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.. సుబ్రహ్మణ్యపురం అనే చిత్రంతో హీరోగా , డైరెక్టర్ గా కూడా పరిచయమైన శశికుమార్.. ఆ తర్వాత నాడోడిగళ్ అనే చిత్రంలో నటించారు కూడా.. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈయనకి అటు హీరోగా ఇటు డైరెక్టర్గా కూడా మంచి పేరు వచ్చింది. కానీ శశికుమార్ మాత్రం హీరో గానే సెటిల్ అయిపోయారు.. ఇక్కడ పలు చిత్రాలలో నటించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు శశి కుమార్..

ఇటీవలే ఆయన హీరోగా నటించిన అయోథి సినిమా మంచి విజయం సాధించడంతో విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.. ఇకపోతే ఇప్పుడు హీరోగా కాకుండా డైరెక్టర్ గా మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు శశి కుమార్.. అందులో భాగంగానే ఒక సినిమాని రూపొందిస్తూ ఉండగా అందులో హీరోయిన్ నయనతారను తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం.. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని శశికుమార్ వెల్లడించారు.. ఇకపోతే శశికుమార్ ఈ చిత్రానికి కేవలం దర్శకత్వం మాత్రమే అందిస్తున్నట్లు, నటన జోలికి వెళ్లడం లేదన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.. మొత్తానికైతే నయనతార ఈ హీరో దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయింది కాబట్టి.. ఈ సినిమా హిట్ అయితే ఈమె నిర్ణయం సరైనదే లేకపోతే మళ్లీ కెరియర్ ప్లాప్ దిశగా అడుగులు వేస్తుంది అని.. కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నయనతార కెరియర్..

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) విషయానికి వస్తే.. ఇటీవలే షారుఖ్ ఖాన్ తో కలసి జవాన్ చిత్రంలో నటించిన ఈమె బాలీవుడ్లో ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో భారీ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. అంతేకాకుండా వివాదాల్లో చిక్కుకొని కేసుల వరకు వెళ్లి చివరికి ఓటీటీ నుంచి కూడా తొలగించారు. ఇకపోతే ఇన్ని జరిగినా సరే నయన్ కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.. కానీ విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతోపాటు మున్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది.

- Advertisement -

నయనతార వ్యక్తిగత జీవితం..

నయనతార వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.. ఇక ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో పాటూ సౌత్ సినిమాలతో కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు