The Goat Life First Review : “ది గోట్ లైఫ్” ఫస్ట్ రివ్యూ

The Goat Life First Review : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రను పోషిస్తున్న మూవీ “ఆడుజీవితం – ది గోట్ లైఫ్”. డైరెక్టర్ బ్లేస్సి దాదాపుగా పదేళ్లు కష్టపడి తీసిన ఈ సర్వైవల్ మూవీ మార్చ్ 28న అంటే మరికొన్ని గంటలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది సినీ పెద్దలకు “ది గోట్ లైఫ్” మూవీకి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్ వేయగా, మూవీ ఎలా ఉందన్న టాక్ బయటకు వచ్చింది. మరి ఇంతకీ “ది గోట్ లైఫ్” మూవీతో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయ్యాడు ? “ది గోట్ లైఫ్” టాక్ ఎలా ఉంది? అంటే…

“ది గోట్ లైఫ్”  ఫస్ట్ రివ్యూ…

“ఆడుజీవితం – ది గోట్ లైఫ్” మూవీని రచయిత బెన్యా మీన్స్ రాసిన బుక్ ఆధారంగా అదే పేరుతో డైరెక్టర్ బ్లేస్సి తెరకెక్కించారు. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి, బలవంతంగా బానిసగా, గొర్రెల కాపరిగా మారిన ఓ వ్యక్తి జీవిత కథ ఈ మూవీ. ఆ ఎడారి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేదే తెరపై చూడాల్సిన స్టోరీ. ఇక మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఏంటి అనే విషయానికి వస్తే… టాక్ ప్రకారం ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగా నడుస్తుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనే టాక్ నడుస్తోంది. సెకండ్ హాఫ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ పై ప్రశంసలు కురవడం ఖాయం అంటున్నారు. అయితే థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఏదో డాక్యుమెంటరీని చూస్తున్న ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు. కానీ సినిమా విజువల్ గా మాత్రం బాగుందని, ముఖ్యంగా ఎడారిలో కనిపించే ఎపిసోడ్స్ లో విజువల్, కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి చూస్తుంటే “ఆడుజీవితం – ది గోట్ లైఫ్” యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందని అనిపిస్తోంది. మరి ప్రేక్షక దేవుళ్ళు ఈ మూవీకి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీకి ఎక్స్పెక్టెడ్ రేటింగ్ : 2-2.5.

సెలబ్రిటీ టాక్ వర్కౌట్ అవుతుందా?

“ఆడుజీవితం – ది గోట్ లైఫ్”లో పృథ్వీరాజ్, అమల పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా జిమ్మీ, రిక్ అభి కీలక పాత్రలో పోషించారు. బ్లేస్సి, జిమ్మీ జిన్ లూయిస్, స్టీఫెన్ ఆడమ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “ఆడుజీవితం – ది గోట్ లైఫ్” మూవీనీ పదేళ్లు కష్టపడి తెరకెక్కించారు డైరెక్టర్ బ్లేస్సి. ఆయన ఈ మూవీని చాలా పరిశోధన చేసి అనంతరం ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. బడ్జెట్ కష్టాలు దాటుకొని, పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ మూవీ మరో మాస్టర్ పీస్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని మరింతగా పెంచేలా సెలబ్రిటీ టాక్ ను ప్రమోషన్ స్ట్రాటజీగా వాడుకుంటున్నారు మేకర్స్. కమల్ హాసన్, మణిరత్నం వంటి స్టార్స్ సినిమా ఎలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. కానీ “ఆడుజీవితం – ది గోట్ లైఫ్” ఆ అంచనాలను అందుకోగలదా? అంటే ఫస్ట్ రివ్యూ ప్రకారం చూస్తే అనుమానమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు