Anasuya : రాజకీయాలలోకి యాంకర్ అనసూయ.. కానీ కండిషన్స్ అప్లై..!

Anasuya : ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఈమె అంతకుముందు ఒక ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది. ఇక జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత యాంకర్ గా స్థిరపడిపోయింది.. అక్కడ తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒక్కసారిగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇక అక్కడ వచ్చిన ఇమేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సెలబ్రిటీగా చలామణి అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా మారి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ మరొకసారి అదే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో దాక్షాయణిగా నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా గనుక హిట్ అయితే అనసూయ పాన్ ఇండియా స్టార్ గా సెటిలైపోతుంది అనడంలో సందేహం లేదు..

ప్రచారకర్తగా పనిచేస్తా…

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ (Anasuya) రాజకీయాలలోకి రాబోతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతుంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ఇది వివాదం కావచ్చు కానీ అడిగారు కాబట్టి చెబుతున్నాను.. నేను తప్పై ఉండొచ్చు.. కానీ నాకు లీడర్స్ తోనే పని.. పొలిటికల్ పార్టీలతో కాదు.. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను.. జబర్దస్త్ లో రోజా, నాగబాబు ఇద్దరితో కూడా పనిచేశాను.. నాకు నాగబాబు చాలా క్లోజ్..ఒకవేళ అటు నుంచి రోజా.. ఇటునుంచి నాగబాబు పార్టీలోకి పిలిస్తే ఈ నాయకులతోనే పనిచేస్తాను.. పార్టీలతో కాదు.. ముఖ్యంగా చాలా పార్టీల నుంచి నాకు చాలామంది లీడర్లు తెలుసు.. వాళ్ళని అభిమానిస్తాను.. వాళ్ళు ఇద్దరు పిలుపునిస్తే ఆ రెండు పార్టీలలోకి కూడా వెళ్తాను.. అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది.. నా అజెండాను బట్టే నేను సపోర్ట్ చేస్తాను..

కండిషన్స్ అప్లై..

అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది.. నా అంతకు నేనుగా రాజకీయాలలోకి వెళ్ళను.. కానీ నాకు తెలిసిన లీడర్స్ ప్రచారకర్తగా పనిచేయమని అడిగితే మాత్రం తప్పకుండా ప్రచారం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.. ఇకపోతే ఆమె మాట్లాడుతూ.. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎందుకంటే మా నాన్న రాజకీయాల్లో ఉండేవారు.. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కూడా కారణం నేనే.. ఈ సొసైటీలో నేను ఉంటున్నాను కాబట్టి మంచి లీడర్ ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. మంచి లీడర్ ని ఎన్నుకోమని నేను వేరే వాళ్ళకి చెప్పడం..వాళ్లు నా మాట వినడం అది నా అదృష్టం.. నేను చెప్తే వింటారు కాబట్టి నేను కరెక్ట్ గా చెప్పాలి.. నేను చెప్తే వింటారని ఏది పడితే అది నేను చెప్పడం తప్పు.. అందుకే ఒక మంచి నాయకుడిని ఎంచుకోమని ప్రజలకు పిలుపునిస్తున్నాను అంటూ చెప్పింది అనసూయ.. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఒక మంచి లీడర్ కాబట్టి ఆయన పిలిస్తే నేను వెళ్తాను.. నేను వెళ్తే మాత్రం తెలుసుకునే వెళ్తాను అంటూ పొలిటికల్ ఎంట్రీ పై అనసూయ క్లారిటీ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు