Srimanthudu Controversy : మహేష్ ను బయట పడేయడానికి నమ్రత ఇంత పెద్ద ప్లాన్ వేసిందా? Thumb : నమ్రత నిజ స్వరూపం బయట పెట్టిన రైటర్

“శ్రీమంతుడు” కాంట్రవర్సీ రోజురోజుకూ మరింత కాంప్లికేట్ గా మారుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కాపీ వివాదంలో తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత పేరు చేరిపోయింది. మహేష్ బాబును ఈ వివాదం నుంచి తప్పించడానికి నమ్రత ఎలాంటి ప్లాన్ వేసిందన్న విషయాన్ని తాజాగా రైటర్ శరత్ చంద్ర బయట పెట్టారు.

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “శ్రీమంతుడు”. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ 2017 ఆగస్టు 7న రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి ఈ మూవీ కదా తనదేనంటూ రైటర్ శరత్ చంద్ర కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తున్నారు. ముందుగా నాంపల్లి కోర్టులో కేసు వేయగా కొరటాల పై చర్యలు తీసుకోవాలంటూ తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో, అనంతరం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, అక్కడ డైరెక్టర్ కొరటాలకు చుక్కెదురైంది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసులో శరత్ చంద్రకే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన నవలను కాపీ కొట్టి సినిమా తీసినందుకు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శరత్ చంద్ర స్పందిస్తూ ఇదే విషయంపై మహేష్ బాబుతో పాటు నవీన్ ఎర్నేనిలపై సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్టుగా వెల్లడించారు. అలాగే ఈ వివాదం నుంచి మహేష్ బాబును బయట పడేయడానికి నమ్రత ఎలాంటి ప్రయత్నాలు చేసిందో కూడా చెప్పుకొచ్చారు.

2012లో శరత్ చంద్ర రాసిన “చచ్చేంత ప్రేమ” అనే నవల స్వాతి మాస పత్రికలో వచ్చింది. అదే కథతో సినిమా తీద్దామని డైరెక్టర్ సముద్రకనిని శరత్ చంద్ర కలిశారట. కానీ తాము ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటుండగా శ్రీమంతుడు రిలీజ్ అయ్యిందని, అయితే సినిమా చూసిన తాను ఆ స్టోరీ తనదేనని గుర్తించానాని, అచ్చు గుద్దినట్టుగా సీన్ టు సీన్ కాపీ కొట్టారని అన్నారు. ఇదే విషయాన్ని నేరుగా డైరెక్టర్ కొరటాల శివకు చెప్పగా ఆయన ఒప్పుకోలేదని, కానీ చాలామంది సినీ ప్రముఖులు రాజీకి ప్రయత్నించారని, 15 లక్షలు ఇస్తామన్నారని శరత్ చంద్ర వెల్లడించారు. ఇక రచయితల సంఘం సహకారంతోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగలిగానని అన్నారు. ఇదే విషయంపై మరోసారి సుప్రీంకోర్టులో హీరో మహేష్ బాబుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కు చెందిన నిర్మాత నవీన్ ఎర్నేనిపై కేసు పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఇలాగే మహేష్ బాబుకు నోటీసులు పంపడానికి ప్రయత్నించగా, ఆయన భార్య నమ్రత మహేష్ ను ఈ కేసు నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారని శరత్ చంద్ర షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు పేరు మీద ఉన్న ఎంబి క్రియేషన్స్ ఓనర్ షిప్ ను మహేష్ బాబు పేరు మీద నుంచి గంగాధర్ పేరు మీదకు మార్పించారని అన్నారు. ఈ కేసులో తగ్గేదే లే అంటున్నారు శరత్ చంద్ర.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు