మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమకే పెద్దన్న.
ఆయన ఎంతో మంది హీరోలకు ఆదర్శం.
పలువురు దర్శకులు తమ సినిమాలు ఆడటానికి, చిరంజీవి నటించిన సినిమాల్లో హైలైట్ సీన్స్ ను స్ఫూఫ్ చేస్తారు. అలాంటి అన్నయ్యకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. ఆయన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. భారీ అంచనాలతో ఇటీవల రిలీజైన “ఆచార్య” మూవీ ఘోర పరాజయం పాలైంది.
ఇండస్ట్రీ పెద్దన్న సినిమాలే డిజాస్టార్ అవుతున్నాయని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో మెగాస్టార్ తన తర్వాత సినిమాల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. డైరెక్టర్లు ఏది చెప్పినా, చేయడానికి సై అంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అందులో భాగంగా, పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “ఖుషి” లోని ఇంటర్వెల్ ముందు భూమిక, పవన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ ను చేయడానికి మెగాస్టార్ రెడీ అయ్యాడట.
చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో “భోళా శంకర్” సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో డైరెక్టర్ మెహర్ రమేష్.. పవన్ ఖుషిలోని ఆ రొమాంటిక్ సీన్ పెట్టాలని అనుకున్నాడట. అంతే కాకుండా ఈ మూవీలో చిరును పవర్ స్టార్ ఫ్యాన్ గా చూపించాలని మెహర్ చూస్తున్నాడని తెలుస్తుంది. దీనికి చిరు కూడా అంగీకరించడంతో ఆ స్ఫూఫ్ షూటింగ్ కూడా పూర్తి అయిందని సమాచారం.
అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. మెగాస్టార్.. అలా ఇతర సినిమాల స్ఫూఫ్ లో నటించడమేంటని అంటున్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ పై కూడా ఫైర్ అవుతున్నారు.
దీంతో మెహర్ రమేశ్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతాడా..? లేదా ఆ సీన్ ను అలాగే కొనసాగిస్తాడా..? అనే సస్పెన్స్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఉంది.