F4 : ‘ఎఫ్4’ లో మూడో హీరో ఉంటాడట..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అపజయమెరుగని దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 3’. మే 27న ఈ ఎఫ్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ కమెడియన్లు కూడా ఈ మూవీలో నటించారు.

‘ఎఫ్2’ ని మించి ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది అంటూ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ తర్వాత ‘ఎఫ్4’ కూడా ఉంటుందని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ఖరారు చేశారు.

తాజాగా అనిల్ రావిపూడి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘ ‘ఎఫ్ 3′ అనగానే మరో హీరోకి కూడా అవకాశం ఉంటుందా అని అంతా భావించారు.. ఎఫ్ 3 మొదలుపెట్టినప్పుడు మూడో హీరో ఆలోచన ఉందా ?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అనిల్ జవాబిస్తూ.. ” ‘ఎఫ్ 2’ ఫినిష్ అయ్యాక ‘ఎఫ్ 3’ గురించి ఆలోచించినప్పుడు 3వ హీరో ఆలోచన వచ్చింది.

- Advertisement -

అయితే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడు వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ‘ఎఫ్ 2’ స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జెనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ‘ఎఫ్ 4’ లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు