RC16 Update: బుచ్చిబాబు – రామ్ చరణ్ కాంబో… ఫైనల్‌గా జాన్వీకే ఓటు

RC16 Update

తెలుగులో వచ్చిన అన్ని సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో ఇది పూర్తి విభిన్నం. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి, శ్రీ దేవి కెమిస్ట్రీ అయితే జనాలు ఇప్పటికీ మర్చిపోరు.

అయితే మెగాస్టార్ చిరంజీవి – శ్రీ దేవి కెమిస్ట్రీ ఇప్పుడు రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ, వారి వారసుల కాంబో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీ దేవి కుమార్తే జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన టైంలో ఫస్ట్ మూవీ.. చిరంజీవి కొడుకు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ తో చేయాలని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, జాన్వీ కపూర్ సౌత్ లో ఫస్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో సెట్ అయిపోయింది. అయినా, తర్వాత మూవీ అయిన చరణ్ తో ఉండాలని చాలా రోజులు నుంచి చూస్తున్నారు.

RC16లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తీసుకువాలని మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి డైరెక్టర్ బుచ్చిబాబును డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో RC16లో జాన్వీ ఫైనల్ అయింది అంటూ చాలా రోజుల నుంచి గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే గాసిప్ చాలా స్ట్రాంగ్ గా ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

- Advertisement -

RC16లో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందని, ఇప్పటికే లుక్ టెస్ట్ కోసం ఫోటో షూట్ కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు… జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు జాన్వీ ఫిక్స్ అవ్వక ముందే.. బుచ్చిబాబు RC16కి జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసి, అప్పుడు కూడా ఫోటో షూట్ చేశారట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

దీంతో పాటు RC16 నటీనటుల ఎంపిక విషయంలోనూ డైరెక్టర్ బుచ్చిబాబు దూకుడుగా వెళ్తున్నాడు. ఉత్తరాంద్ర స్లాంగ్ తో ఉన్నవాళ్లు ఆడిషన్స్ కు రావొచ్చు అని ఇప్పటికే ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా యూట్యూబ్ లో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు