Mrunal Thakur: అవార్డ్స్ వేడుకలో మృణాల్ కి ఘోర అవమానం..!

Mrunal Thakur

ఒకప్పుడు సీరియల్ యాక్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ గా మారిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా, పద్ధతిగా కనిపించి.. సీత క్యారెక్టర్ లో ఒదిగిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోవడమే కాదు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా దక్కించుకుంటుంది. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. మృణాల్ ఠాకూర్..

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్లో జరిగిన ఒక అవార్డు వేడుకలో తనకు జరిగిన ఘోర అవమానాన్ని గుర్తుచేసుకుంది.. అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ దగ్గర కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ తీసుకున్నారు..అయితే అక్కడికి ఒక స్టార్ కిడ్ రావడంతో మీడియా వాళ్ళు మృణాల్ తో ఇంటర్వ్యూ ని మధ్యలోనే ఆపేసి.. ఆ స్టార్ కిడ్ దగ్గరికి పరుగులు పెట్టారు.. ఇక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె నెపోటిజంపై వైరల్ కామెంట్స్ చేశారు..” ప్రతి ఒక్కరూ నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటాము.. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు.. ప్రతి ఒక్క ఆడియన్ స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీంతో మీడియా కూడా ఆ వార్తలనే రాయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది ” అంటూ తెలిపింది. దీంతో మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ విషయాలు విన్న తర్వాత చాలామంది నెటిజన్ లు మృణాల్ కి మద్దతు పలుకుతున్నారు. నెపోటిజం గురించి ఈమె చాలా కరెక్ట్ గా చెప్పింది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఇకపోతే గతంలో ఇదే విషయాన్ని నాని కూడా చెప్పారు.. చిరంజీవి కొడుకు సినిమా రిలీజ్ అయితే వందల మంది ఆడియన్స్ ఆ సినిమా చూడడానికి వెళ్తారు కానీ ఆ సినిమా చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారు.. అంటే ఇక్కడ నెపోటిజంని సపోర్ట్ చేస్తోంది ఆడియన్సే కదా.. నెపోటిజం ఉన్నది ఇండస్ట్రీలోని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ హీరోల్లో కాదు వారిని ఆదరిస్తున్న ఆడియన్స్ లో అంటూ ఆయన తెలిపారు..

- Advertisement -

మొత్తానికైతే నెపోటిజం అనేది స్టార్ కిడ్స్ తప్పు కాదు అని ఆడియన్స్ తప్పు అన్నట్లుగా కామెంట్లు చేశారు.. అయితే ఇక్కడ ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే స్టార్ సెలబ్రిటీల కిడ్స్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు.. ఈ క్రమంలోని ఆడియన్స్ కూడా అటువైపు మొగ్గు చూపిస్తారు. అందుకే ఎవరికి వారు క్రేజ్ దక్కించుకుంటున్నారనటంలో సందేహం లేదు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశం అనేది ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు