Bollywood: ఈ బాలీవుడ్ స్టార్ హీరోలకు హైకోర్టు నోటీసులు.. కారణం..?

ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. ఆ సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని ఇప్పుడు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారు ప్రమోట్ చేసే ఉత్పత్తులు ప్రజలకు హాని కలిగిస్తాయా? లేక మంచి చేస్తాయా? అన్న విషయాన్ని గమనించకుండా.. డబ్బు కోసం కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేసినందుకుగాను ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలకు తాజాగా అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ , షారుక్ ఖాన్ లకు తాజాగా అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. పాన్ మసాలా, గుట్కా ఆడ్స్ లో ఈ ముగ్గురు నటించినందుకు గాను వారికి అలహాబాద్ న్యాయస్థానం లీగల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును అటు హైకోర్టుతో పాటు ఇటు సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది. మోతిలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి యాడ్స్ లో నటించడం సరికాదు అంటూ ఆ పిటీషన్ లో తెలిపారు. అయితే దీనిని విచారించిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుపుతూ మరొకసారి పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ విషయంపై స్పందించిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బి పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. అంతేకాదు ఇందులో భాగంగానే వీరి ముగ్గురికి అక్టోబర్ 22వ తేదీని షోకాస్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఇకపోతే ఇదే విషయంలో అమితాబ్ బచ్చన్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన ఒక పాన్ మసాలా యాడ్ లో చేయగా.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి వెనక్కి తప్పుకుని .. కాంట్రాక్టును బ్రేక్ చేసుకున్నారు. అయినా సరే ఆ సంస్థ ఇంకా అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ప్రకటనను టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ కంపెనీకి అమితాబ్ లీగల్ నోటీసులు పంపారని పాండే వెల్లడించారు.

- Advertisement -

ప్రస్తుతం తదుపరి విచారణ 2024 మే 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరి దీనిపై ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఏదైనా స్పందిస్తారా? లేక యాడ్ నుంచి తప్పుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు