Nayanatara: సూపర్ స్టార్ బిరుదు పై మరో కొత్త వివాదం.. స్పందించిన నయనతార..!

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా సూపర్ స్టార్ అనే బిరుదు పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సాధారణంగా మనకు సూపర్ స్టార్ అనగానే తెలుగులో కృష్ణ.. ఆ తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబు గుర్తొస్తారు. కానీ తమిళంలో సూపర్ స్టార్ అంటే వెంటనే రజినీకాంత్ గుర్తొస్తారు. కేవలం తమిళ్లోనే కాదు బయట పరిశ్రమలలో కూడా ఆయనను అందరూ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ నటనకి.. స్టైల్ కి ఫిదా అయిన ప్రేక్షకులు ఆయనకు ఇలా సూపర్ స్టార్ అనే బిరుదును తగిలించారు. అయితే ఎప్పటినుంచో రజినీకాంత్ సినిమాలకు సూపర్ స్టార్ అనే టైటిల్ కార్డు పడుతున్న విషయం తెలిసిందే.

అయితే గత కొన్ని సినిమాల నుంచి అటు నయనతారకి కూడా లేడీ సూపర్ స్టార్ అని టైటిల్ కార్డు వేస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి గత 17 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో అలుపెరుగని బాటసారిలా తన నటనతో అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార.. వరుస విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి మరింత పేరు దక్కించుకున్న ఈమె స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.అందుకే అభిమానులు నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇటీవల నయనతార నటించిన సినిమా టైటిల్స్ లో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేయడంతో ఇప్పుడు ఇది కాస్త వివాదంగా మారింది.

రజినీకాంత్ అభిమానులు సూపర్ స్టార్ అనే టైటిల్ ఇంకెవరికి ఉండకూడదు అని.. నయనతారకి ఉన్న ఆ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను కూడా తొలగించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల నయనతార నటించిన అన్నపురాణి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలో కూడా ఆమె పేరుకి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేశారు. దీంతో రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో నయనతారపై.. ఆ చిత్ర బృందం పై ఫైర్ అవుతుండడం గమనార్హం . అంతేకాదు మరోపక్క విజయ్ కి కూడా సూపర్ స్టార్ పెట్టాలని విజయ్ అభిమానులు పోస్ట్లు పెడుతూ ఉండడంతో ఈ సూపర్ స్టార్ వివాదం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది.

- Advertisement -

అయితే తాజాగా దీనిపై స్పందించిన నయనతార.. నేను తెరపై కేవలం నయనతార అనే టైటిల్ మాత్రమే ఉండాలని చెప్పాను.. కానీ అన్నపురాణి సినిమా డైరెక్టర్ వినకుండా లేడీ సూపర్ స్టార్ అని వేశాడు. దీనికి నన్ను 10 మంది పొగిడితే 50 మంది తిడుతున్నారు.. నాకు అలా పిలిపించుకోవాలని లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు