Skanda: పూజా హెగ్డేలా దారుణంగా తయారైన శ్రీలీల.. ఇక కెరీర్ ముగిసినట్టేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అటు పాత్రల ఎంపికైనా.. ఇటు సినిమాల రిజల్ట్ అయినా.. ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఓసారి సక్సెస్ అయ్యాక స్టార్ హీరోలతో చాలా అవకాశాలు ఈజీగా వస్తుంటాయి. కానీ కథల విషయంలో తొందర పడితే ఇమేజ్ ఒక్కోసారి డౌన్ అవుతుంది. ఇలా కథల విషయంలో తడబడి ఇప్పటికే పూజా హెగ్డే, కృతి శెట్టి వంటి హీరోయిన్లు వరుస ఫ్లాప్ లను చవిచూస్తున్నారు.

అంతేకాదు ఐరన్ లెగ్ అనే పేరుని కూడా మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ కూడా వీళ్లలాగే ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకోబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఆ హీరోయిన్ మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల గత సంవత్సరం రవితేజ నటించిన ధమాకా సినిమాతో రాత్రికి రాత్రి టాప్ హీరోయిన్ అయిపోయింది. దీంతో ఆమె చేతికి వరుసగా సినిమాలు వచ్చాయి. ఏకంగా బాలయ్య, పవన్, మహేష్ తో పాటు నితిన్, రామ్ లాంటి కుర్ర హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.

అయితే కథకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయకుండా కేవలం రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఇష్టం వచ్చినట్లుగా శ్రీలీల సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత మూడు నెలల్లో ఆమెకు వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి. వాటిలో రామ్ తో చేసిన స్కంద, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, తాజాగా నితిన్ కి జోడిగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలలో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేని సినిమాలను ఎంచుకొని కేవలం డ్యాన్సులకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ మహేష్ బాబు కి జోడిగా నటిస్తున్న గుంటూరు కారం పైనే ఉన్నాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఇకనుండి అయినా శ్రీలీల కథల, పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇక ఆమె కెరీర్ అంతేనని అంటున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు