Guntur Karam :”గుంటూరు కారం” లో మీనాక్షి చౌదరికి ఇంత అన్యాయం చేశారా..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా గుంటూరు కారం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు రెండు కమర్షియల్ గా కంటే మహేష్ బాబు – త్రివిక్రమ్ ఇద్దరికీ మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సహజంగానే భారీ స్థాయిలో అచనాలు నెలకొన్నాయి. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను కూడా భాగం చేశారు. అయితే కొన్ని కారణాలతో ఈ చిత్రం నుండి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే మీనాక్షి, శ్రీలీల ఇద్దరూ క్రేజీ హీరోయిన్లు కావడంతో సినిమాకు కావలసిన అంత గ్లామర్ వచ్చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని సాంగ్స్ గురించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముందు నుంచి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఉంటారా..? ఉండరా..? అన్న సస్పెన్స్ నడిచింది.

ఇక ఇప్పుడు సినిమాలో ఐదు పాటలే ఉంటాయని అంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన అతడు, ఖలేజా సినిమాలలో పాటలు ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోని పాటల విషయంలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఒక పాట బయటకు వచ్చింది. అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఇక మిగిలిన నాలుగు పాటల్లో ఒకటి బ్యాక్ గ్రౌండ్, ఇంకోటి మాంటేజ్ సాంగ్ అని అంటున్నారు. అంటే ఇక రెండు పాటలే మిగిలి ఉంటాయి. ఇందులో ఒకటి హీరోయిన్ మీనాక్షి వెంటపడుతూ హీరో పాడే పాట అయితే ఇంకొక పాటే ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ డ్యూయెట్ అనుకుంటే.. అది శ్రీలీల – మహేష్ బాబు మీద ఉంటుందట. అంటే ఈ చిత్రంలో మహేష్ బాబు మీనాక్షి చౌదరి మధ్య డ్యూయెట్ ఉంటే చాన్సులు లేవు. దీంతో గుంటూరు కారం సినిమా ద్వారా మీనాక్షి చౌదరికి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు