Bigg Boss Telugu 7 : 14 వారాలకు శోభా శెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటిదాకా 6 సీజన్లో సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న ఏడవ సీజన్ కూడా ఎండింగ్ దశకు వచ్చింది. సెప్టెంబర్ 3న సీజన్ షురూ కాగా, ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో 14వ వారానికి చేరుకుంది. ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా కంటెస్టెంట్ శోభ శెట్టి ఎలిమినేట్ కానుంది. ఈ 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లో ఒక అర్జున్ తప్ప అందరూ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, అమర్ ఈవారం నామినేషన్ లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది యావర్, శోభా శెట్టి. వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉండగా, శోభ శెట్టి ఎలిమినేట్ అయింది. ఈ ఇద్దరిలో శోభా శెట్టికే తక్కువ ఓటింగ్ రావడంతో ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

నిజానికి శోభ శెట్టిపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో నెగెటివిటీ బాగా ఉంది. హౌస్ లో ఆమె ప్రవర్తిస్తున్న తీరు, మాటలు జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి. అయినప్పటికీ ఆమె హౌస్ లో ఏకంగా 14 వారాలపాటు కొనసాగింది. తాజాగా శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అన్న విషయం ముందుగానే లీక్ అయింది. కాగా 14 వారాలు హౌస్ లో గడిపిన ఈ బ్యూటీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్త ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇక శోభా శెట్టి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే సమాచారం ప్రకారం ఆమె వారానికి రెండు లక్షల చొప్పున 14 వారాలకు గానూ 28 లక్షలు తీసుకుందనీ తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శోభ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో హౌస్ లో 6 మంది కంటెస్టెంట్స్ ఉంటారు.

ఆ ఆరు మందిలో ఈ సీజన్లో టాప్ ఫైవ్ విషయానికి వస్తే… పల్లవి ప్రశాంత్ అందరికంటే ముందంజలో ఉన్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవుతాడంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక రన్నర్ గా సీనియర్ నటుడు శివాజీ ఉండచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సీజన్ గత సీజన్లో లాగా ఉండదు అని మొదట నుంచి నాగార్జున చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఓటింగ్ లో కీలక మార్పులు చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్ అంతా ఉల్టా పల్టాగా ఉంటుందని తేల్చేశారు. గత ఆరు సీజన్లో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఈ 10 ఓట్లు ఒక కంటెస్టెంట్కు మాత్రమే వేయకుండా హౌస్ లో ఎంతమంది నచ్చితే అంతమందికి వేసే విధంగా ప్లాన్ చేశారు.

- Advertisement -

కాల్స్ విషయంలో కూడా బిగ్ బాస్ మేకర్స్ పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు. గతంలో లాగా కాకుండా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేసేలాగా ప్లాన్ చేశారు. ఇక ప్రేక్షకుల నుంచి ఈ షోకు వస్తున్న ఆదరణ చూస్తుంటే వాళ్ళ ప్లాన్స్ ఫలించినట్టుగానే కనిపిస్తోంది. మరి అందరూ అంచనా వేస్తున్నట్టుగా అర్జున్ సీజన్ సెవెన్ విన్నర్ గా అవతరిస్తాడా? లేదంటే ఎప్పటిలాగే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా బిగ్ బాస్ తనకు నచ్చిన వ్యక్తిని విన్నర్ గా ప్రకటిస్తారా అనేది చూడాలి.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు