Tollywood: 2023 లో ఒక్క సినిమాలో కూడా కనిపించని హీరోయిన్స్

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వాళ్లలో కొంతమందే సక్సెస్ అవుతారు. కొందరు ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక సక్సెస్ అయిన హీరోయిన్లు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయి ఏడాదికి అరడజను సినిమాలతో కోట్లు వెనకేసుకుంటారు. వాళ్లలో కొందరు ఇతర ఇండస్ట్రీలపై మోజుతో మకాం మార్చేస్తారు. అలాగే 2023 లో కూడా చాలా మంది భామలు ఎంట్రీ ఇవ్వగా, శ్రీ లీల లాంటి వాళ్ళు వరుస సినిమాలతో దూసుకెళ్లారు. కానీ లాస్ట్ ఇయర్ వరుస సినిమాలతో అలరించిన కొందరు స్టార్ హీరోయిన్లు ఈ ఇయర్ మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అలాంటి హీరోయిన్లలో 2023 లో టాలీవుడ్ లో కనిపించని భామలెవరో ఓ లుక్కేద్దాం..

1). పూజ హెగ్డే :

ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ భామ బాలీవుడ్ పై మోజుతో టాలీవుడ్ ని వదిలి వెళ్ళింది. లాస్ట్ ఇయర్ ఆచార్య, రాధే శ్యామ్ లో నటించిన ఈమె 2023 లో ఒక్క సినిమా కూడా చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించింది.

- Advertisement -

2). రకుల్ ప్రీత్ సింగ్:

రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ ముందు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జత కట్టిన ఈమె నెంబర్ వన్ రేసులో ఉండేది. కానీ అందరి హీరోయిన్ల లా రకుల్ బాలీవుడ్ లో కూడా హవా చూపిద్దామని టాలీవుడ్ ని దూరం చేసుకుంది. ఇప్పుడు అక్కడ ఆఫర్లు లేకపోయే సరికి టాలీవుడ్ కి వద్దామనుకున్నా ఇక్కడ నిర్మాతలు ఎవరూ ఇంకా ఛాన్స్ లు ఇవ్వడం లేదు. 2021 లో కొండపొలం లో చివరగా నటించిన ఈమె ఇప్పటివరకు తెలుగులో చేయలేదు.

3). సాయి పల్లవి:

టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునే సాయి పల్లవి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది. అందుకే తక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మాయికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. చివరగా సాయి పల్లవి విరాట పర్వం లో నటించగా ఈ ఇయర్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య తో ఓ సినిమా చేస్తుండగా ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ వస్తుంది.

4). అనుమప పరమేశ్వరన్:

టాలీవుడ్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ముందు వరుస సినిమాలు చేసినా తర్వాత నెమ్మదించింది. లాస్ట్ ఇయర్ నిఖిల్ నటించిన 18 పేజెస్ లో కనిపించిన అనుపమ 2023 లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక వచ్చే ఏడాది టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

5). ప్రియాంక అరుళ్ మోహన్:

టాలీవుడ్ లో గ్యాంగ్ లీడర్ అనే ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో వరుస ఆఫర్లు వచ్చినా మెల్లిగా సినిమాలు చేస్తుంది. రెండేళ్ల కింద శ్రీకారం సినిమాలో నటించగా, ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల ద్వారా పలలరించింది. అయితే ఈ ఇయర్ మాత్రం ప్రియాంక ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ తెలుగులో “ఓజి”, సరిపోదా శనివారం రెండు సినిమాలతో రానుంది.

6). అంజలి:

తెలుగమ్మాయి అయిన అంజలి ముందుగా తమిళ్ లో గుర్తింపు తెచ్చుకోగా, ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పాపులర్ కాగా, అప్పట్నుంచి బాగా సినిమాలు చేసింది. అయితే 2023 లో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ గేమ్ ఛేంజర్ తో హీరోయిన్ గా ఆడియన్స్ ని పలకరించబోతుంది.

7). నభా నటేష్:

ఇస్మార్ట్ శంకర్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ కెరీర్ బిగినింగ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఈ ఇయర్ మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

8). నిధి అగర్వాల్:

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ తో క్రేజ్ సంపాదించుకుంది. లాస్ట్ ఇయర్ హీరో సినిమాలో నటించిన ఈ భామ 2023లో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

9). ప్రియాంక జవాల్కర్:
అనంతపూర్ కి చెందిన ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయిగా టాలీవుడ్ కి టాక్సీవాలా తో పరిచయమవగా చిన్న సినిమాల్లో మంచి ఆఫర్లు అనుకుంది. లాస్ట్ ఇయర్ గమనం సినిమాలో నటించగా 2023 లో ఒక్క సినిమాలోనూ నటించలేదు.

10). చాందిని చౌదరి
యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు పొందిన చాందిని చౌదరి తెలుగుమ్మాయి అన్న అడ్వాంటేజ్ తో ఎంట్రీ ఇవ్వగా కలర్ ఫోటో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ఇయర్ సమ్మతమే సినిమాలో నటించిన ఈ భామ 2023 లో ఏ సినిమాలోనూ నటించలేదు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు