Fingertip Peeling : చేతి వేళ్ళ చివర చర్మం ఎందుకు ఊడుతుందో తెలుసా?

అరచేతిలో చర్మం పొట్టు రాలుతున్నట్టుగా అనిపించడం, వేల చివర్లలో ఉండే చర్మంపై పొర మనకు తెలియకుండానే ఊడిపోవడం వంటి విషయాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ సమస్యకు కారణం ఏంటి? ఫింగర్ టిప్ పీలింగ్ అంటే ఏంటి? ఫింగర్ టిప్ ఫీలింగ్ కు చికిత్స ఏంటి? అనే విషయంలోకి వెళితే…

ఫింగర్ టిప్ ఫీలింగ్ అంటే చేతి వేళ్లపై ఉండే పొట్టులా రాలిపోవడం. ఇది చాలా సాధారణ సమస్య. కానీ ఆ సమస్య ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మన ధ్యాస అంతా చేతులపైనే ఉంటుంది. చలికాలంలో ఈ వ్యాధి వచ్చే అవకాశం మరింతగా పెరుగుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల కూడా కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరి ఇలా చేతివేళ్లపై పొట్టు రాలిపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతులు తరచుగా కడుక్కోవడం, వాతావరణంలో మార్పు, సన్ బర్న్, చేతులతో రసాయనాలు వాడడం, చేతి తామర, ఎక్స్పోలియేటివ్ కెరటోలిసిస్, సోరియాసిస్, చర్మం పొడిబారడం, వేలి చివర్లను. తరచుగా నోట్లో పెట్టుకోవడం, విటమిన్ బి3 లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది సాధారణ సమస్య కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చేతులపై ఉన్న పొట్టు దానంతట అదే రెండు మూడు రోజుల నుంచి వారం రోజుల లోపు రాలిపోతుంది. కానీ కొన్నిసార్లు ఈ సమస్య ఎక్కువవుతుంది. అలాంటప్పుడు చేతి వేళ్ళు నొప్పి పెట్టడం, ఉబ్బడం, ఎక్కువగా దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా ఈ సమస్య ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించండి. డెర్మటాలజిస్ట్ సూచనల ప్రకారం సరైన జాగ్రత్తలు తీసుకోండి.

- Advertisement -

ఇక ఫింగర్ టిప్ ఫీలింగ్ సమస్యకు కొన్ని ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చేతులను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఒకవేళ చేతివేళ్లపై పగుళ్లు ఉండే అది చల్లని నీళ్ల వలన ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. పాత్రలు కడగడం వంటి ఇంటి పనులు చేస్తున్నప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోండి. చల్లని వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు చేతులు వెచ్చగా ఉండేలా కవర్ చేసుకోండి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాత వాటిని తేమగా ఉండేలా చూసుకోండి. చేతులు పొడిగా మారడానికి టవల్ తో ఎక్కువగా రుద్దకండి. శరీరానికి అవసరమైన నీరు తాగడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇంకా కఠినమైన కెమికల్ ను ఉపయోగించడం మానుకోండి. సమస్య ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్నిబట్టి డెర్మటాలజిస్ట్ దానికి తగిన మందులను సజెస్ట్ చేస్తారు. కాబట్టి డెర్మటాలజిస్ట్ ని కలిసిన తరువాతే మందులు వాడడం స్టార్ట్ చేయండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు