Hbd Lavanya Tripathi : ఈ కొత్త జంట ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కొత్తజంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లో ఆర్కిటిక్ సర్కిల్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వింటర్ వెకేషన్ లో ఉన్న ఈ జంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకోబోతున్నారు. ఈరోజు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా వాళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అందులో భాగంగానే ఈ లవ్ బర్డ్స్ ఆస్తుల విలువ ఎంత? అనే విషయంలోకి వెళ్తే…

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దాదాపుగా ఆరేళ్లు ప్రేమించుకుని, ఈ ఏడాది నవంబర్ 1న ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలోని టుస్కానీలో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తన తొలి దీపావళిని ఫ్యామిలీతో కలిసి హైదరాబాదులోనే జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ తో పాటు హనీమూన్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్ళింది. ఎప్పటికప్పుడు అక్కడ తమ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఈ జంట. ఇక ఈరోజు లావణ్య పుట్టినరోజు కావడంతో కొత్త కోడలికి మెగా అభిమానుల నుంచి విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ టాలీవుడ్ కు చెందిన నటీనటులు కావడంతో వాళ్ల ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే…

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా మొదటి సినిమాతోనే “అందాల రాక్షసి” అనిపించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితేనేం మెగా హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ కళ్ళలో పడింది. మొత్తానికి వీరిద్దరూ కొన్నేళ్లు ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక లావణ్య త్రిపాఠి కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోకుండా రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ లాంటి అన్ని జోర్నర్లలో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే ఆమె పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. సినిమాలతో పాటు ఎండార్స్మెంట్స్ కూడా తోడు కావడంతో బాగానే వెనకాల వేసుకుంది ఈ బ్యూటీ. 2023 నాటికి లావణ్య త్రిపాఠి ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ప్రస్తుతం అతని ఆస్తి రూ. 47 కోట్లు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

పెళ్లయిన తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తుంది. మరి వెకేషన్ తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా లేకపోతే మొత్తానికి సినిమాలకు దూరంగా ఉంటుందా అనే విషయం తెలుస్తుంది. మరోవైపు వరుణ్ తేజ్ “మట్కా” అనే పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీతో మెగా ప్రిన్స్ పాన్ ఇండియా హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు