NTR 31 : జగతి మేడంకు బంపర్ ఆఫర్… ఏకంగా తారక్ సినిమాలో ఛాన్స్

జ్యోతి రాయ్… సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ బుల్లితెర బ్యూటీ గురించి టీవీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా కావలసినంత పాపులారిటీ దక్కించుకొని ఫుల్ ఫేమస్ అయిన ఈ అమ్మడు సినిమాలో అవకాశాలు రావడంతో సీరియల్ నుంచి సైడ్ అయిపోయింది. అయితే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో జగతి మేడంగా ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసింది. ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకోవడం వారు జీర్ణించుకోలేకపోయారు. అయితేనే బుల్లితెర నుంచి సైడ్ అయిపోయిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టింది. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. రోజుకో హాట్ పిక్ షేర్ చేసి యూత్ కలల రాణిగా మారి హీటెక్కిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జ్యోతి రాయ్ కి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది కూడా ఓ వ్యక్తి రికమండేషన్ వల్లనే అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ చిన్నది ఆల్రెడీ పెళ్లయి ఒక పిల్లాడు ఉన్న యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు వైరల్ అయ్యాయి. డైరెక్టర్ సుకు పూర్వ రాజ్ తో జ్యోతి రిలేషన్షిప్ లో ఉంది అనే రూమర్ టాలీవుడ్ ను షేక్ చేసింది. తనపై ఎంత ట్రోలింగ్ వచ్చినా అసలే మాత్రం పట్టించుకోని ఈ బ్యూటీ ఏకంగా అతనితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసేసింది. ఇక ఈమె బోల్డ్ నెస్ చూసి హాట్ హాట్ వెబ్ సిరీస్ లలో ఆఫర్లు కూడా ఇస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ కి బాగా సన్నిహితుడైన సుకు పూర్వ రాజ్ ఆమెను ఎన్టీఆర్ 31 సినిమాలో తీసుకోమని సలహా ఇచ్చారట.

ప్రస్తుతం ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తే ఆమె ఫేట్ మారుతుంది అంటూ తన ఫ్రెండ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు సజెషన్ ఇచ్చారట పూర్వ రాజ్. ప్రశాంత్ నీల్ కూడా ఈ బ్యూటీకి ఆఫర్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఆమె ఈ మూవీలో విలన్ భార్య పాత్రలో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఏదైతేనేం ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోలో ఏదైనా ఒక కీలకపాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం అధికారిక అనౌన్స్మెంట్ వస్తేనే గాని తెలియదు. ఈ వార్తలు గనుక నిజమైతే ఈ మూవీతో జ్యోతి ఫేట్ మారినట్టే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు