Manoj: మనోజ్ మాటలకు కంటతడి పెట్టుకున్న మౌనిక.. ఏమైందంటే.?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు మనోజ్ తనకంటూ మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి .. ఆడియన్స్ కు మరింత దగ్గరై.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. అటు వెండితెర ఇటు బుల్లితెరపై కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా.. ఉస్తాద్ – ర్యాంప్ ఆడిద్దాం.. అనే ఒక కొత్త షోకి హోస్టుగా చేస్తున్నారు. ఇక తాజాగా ఈ టాక్ షో కి సంబంధించిన ప్రోమోని నిర్మాతలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరైన మనోజ్ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం గమనార్హం.

అందులో భాగంగానే తన భార్య మౌనిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది.. మనోజ్ మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఏడు అడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నాను.. ఇక ఆ గ్యాప్ లో ఎన్నో చూశాను.. ముఖ్యంగా డిఫరెంట్ లైఫ్ ని చూశాను .. అంతకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. కానీ ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు నాకు ధైర్యం ఇచ్చింది అభిమానుల ప్రేమ.. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే అభిమానుల ప్రేమ విలువ నాకు తెలిసింది. నాకు ఒక మంచి టీం దొరికింది అంటూ ఆయన తెలిపారు.

ఇకపోతే ఈ ఈవెంట్ కి మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక కూడా హాజరయ్యారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే తనకు అభిమానుల విలువ తెలిసిందని చెప్పడంతో ఆమె ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. తన భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది .అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మంచు మనోజ్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. మొదట భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్ ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. అటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. కొత్తగా వైవాహిక జీవితంలోకి ఇదే ఏడాది అడుగుపెట్టిన ఈ జంట మరింత సంతోషంగా ఉండాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అలాగే మంచు మనోజ్ హోస్టుగా చేస్తున్న ఈ కొత్త టాక్ షో కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు