Dilraju: నిర్మాతగానే కాదు అంతకుమించి.. టాలెంట్ కి సినీ లోకం ఫిదా..!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్త మరింత వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళ్తే నాగచైతన్య మొదట సినిమా జోష్ సినిమా కథను తీసుకొని మొదట దిల్ రాజు చిరంజీవి దగ్గరకు వెళ్లి.. ఆయనకు కథ వినిపించారు. రామ్ చరణ్ కి బాగుంటుందని చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇది వర్క్ అవుట్ కాదని చిరంజీవి అనడం.. ఆ తర్వాత దిల్ రాజు పట్టుబట్టి మరి నాగచైతన్యతో ఈ సినిమా తెరకెక్కించడం అందరికీ తెలిసిందే. ముందుగా నాగార్జునకు కథ చెప్పి .. నాగచైతన్య హీరోగా పెట్టి దిల్ రాజు జోష్ అనే సినిమాను తీశారు. వాసు వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ అవ్వలేదు కానీ మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పాటలు అప్పటి యువతను బాగా అలరించాయి.

అంతేకాదు ఆ పాటల్లో ఒకదాన్ని దిల్ రాజు పాడారు అన్న విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ పాట, దాని నేపథ్యం నెట్టింట్లో మరింత వైరల్ గా మారుతుంది. తాజాగా రాఘవేంద్రరావు చేసిన ఒక షోలో దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. జోష్ సినిమాలో జెడి చక్రవర్తి ఎంట్రీలో వచ్చే అన్నయ్యొచ్చినాడు అనే పాట దిల్ రాజు ఆలపించారట. అయితే ఎవరైనా ట్యూన్ కి లిరిక్స్ ఇచ్చి వెళ్తే.. తానే కరెక్ట్ చేస్తానని.. ఒకవేళ సరైన పదాలు పడకపోతే మళ్లీ రైటర్ ని పిలిపించి కరెక్ట్ చేయిస్తానని దిల్ రాజు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన నిర్మాత గానే కాకుండా ఇలా ఒక సింగర్ గా మరింత పాపులారిటీ దక్కించుకున్నారని చెప్పాలి.

ఏదేమైనా ఆయన టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇకపోతే అలా ఒక పాటను వాసు వర్మ పాడమని బలవంతం పెట్టాడని.. అందుకే పాడాల్సి వచ్చిందని దిల్ రాజు చెప్పారు. దీంతో ఆ వీడియో కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఇకపోతే దిల్ రాజులో ఇలాంటి టాలెంట్ ఉందని తమకు ఇంతవరకు తెలియదని కొంతమంది నెటిజన్స్ అంటే మరి కొంతమంది ఎంతైనా ఆయన అన్నింటిలో సూపర్ టాలెంటెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు