Relationship Tips : మీ పార్టనర్ లో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే బ్రేకప్ ఖాయం

రిలేషన్షిప్ అన్నాక హెచ్చుతగ్గులు ఉండడం చాలా సాధారణ విషయం. అయితే మీ లైఫ్ పార్టనర్ లో కొన్ని అసాధారణమైన లక్షణాలు కనిపించాయంటే మీరు బంధం ఎక్కువ కాలం నిలబోదని అర్థం. త్వరలోనే బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ అవసరాలను అగౌరవపరుస్తున్నారా? హెల్తి రిలేషన్ లో ఉండాలంటే పరస్పర అవగాహన, అవతలి వారి అవసరాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎవరైనా తన పార్టనర్ అవసరాలను కొట్టిపారేసినా, విస్మరించినా, లేదా తక్కువ చేసిన అది భావోద్వేగ నిర్లక్ష్యం అవుతుంది. ఈ చిన్న విషయమే పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరి అవసరాలను మరొకరు గౌరవించుకోవడం, నమ్మకాన్ని పెంపొందించుకోవడం, శ్రద్ధ చూపించడం రిలేషన్షిప్ లో చాలా ముఖ్యమైన అంశాలు.

వివరణ లేకుండా వెళ్ళిపోతున్నారా? ఏదైనా గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నప్పుడు పార్ట్నర్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఆకస్మికంగా వెళ్లిపోవడం అనేది మంచి విషయం కాదు. రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైన అంశం. కారణం లేకుండా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే అది ఆందోళనను కలిగిస్తుంది. అలాగే బాధిస్తుంది. ఇలా చేస్తున్నారంటే మీరు మీ లైఫ్ పార్టనర్ ని రిజెక్ట్ చేసినట్టే.

- Advertisement -

మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా? అవసరమైన విషయాల్లో సపోర్ట్ అందించడం అనేది పార్ట్నర్ లో ఉండాల్సిన మంచి అలవాటు. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటే ఫ్యూచర్ లో వారి బంధం మరింత బలపడుతుంది. ఒకవేళ సపోర్ట్ అందించకపోతే గనక అది అవతలి వారిని ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలా జరిగితే మీ రిలేషన్షిప్ ఇక అక్కడితో ఎండ్ అవుతుంది.

మిమ్మల్ని వారికి మాత్రమే సొంతం అనేలా భావిస్తున్నారా? లైఫ్ పార్ట్నర్ ని ఏదో కొనుక్కున్న వస్తువు లాగా తనకే సొంతం అన్నట్టుగా ప్రవర్తించడం, వారిని నియంత్రించాలని చూడడం సమస్యకు మూల కారణం అవుతుంది. కుటుంబం లేదా స్నేహితుల నుంచి మిమ్మల్ని దూరం చేయడం, మీకు తెలియకుండానే నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలు రిలేషన్షిప్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటివి చేస్తే ఆ బంధం ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉండదు.

ఇక ఇలాంటి లక్షణాలతో పాటు ఎప్పుడూ వారే కరెక్ట్ అనేలా వ్యవహరించడం, మిమ్మల్ని బలహీనంగా భావించేలా చేయడం, రిలేషన్ షిప్ ను నిలబెట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం వంటి విషయాలు బ్రేకప్ చేసుకునేలా చేస్తాయి. మరి మీ రిలేషన్ షిప్ బ్రేకప్ కు దారి తీయకుండా ఉండాలంటే లైఫ్ పార్టనర్ తో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు