Sreeleela : షూటింగ్స్ కు బ్రేక్… శ్రీలీల షాకింగ్ డెసిషన్

ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాలని షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె తీసుకోబోయే ఈ బ్రేక్ కారణంగా ఏ సినిమాలపై పడబోతోంది? ఇంతకీ శ్రీ లీల ఎందుకు బ్రేక్ తీసుకుంటోంది? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం శ్రీలీల ఒకవైపు చదువుకుంటూ, మరోవైపు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ చదువును మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలోనే డాక్టర్ కాబోతున్న ఈ చదువుల తల్లి ఒక వైపు సినిమాలు, రెండోవైపు చదువు అంటూ రెండు పడవలపై కాలేసి నడిపిస్తోంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న ఈ బ్యూటీ కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతుందని, ప్రస్తుతానికి తన చదువుపై ఫోకస్ పెట్టబోతోందని సమాచారం.

శ్రీలీల గత కొన్ని రోజులుగా ఎంతటి బిజీ షెడ్యూల్ గడుపుతోంది అంటే, ఉదయం ఒక సినిమాకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంటే, మధ్యాహ్నం కి మరో మూవీ, రాత్రికి ఇంకో మూవీ షూటింగ్ లోకేషన్ కు వెళ్లాల్సి వస్తోంది. అయితే మొత్తానికి తన ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండబోతోంది ఈ బ్యూటీ.

- Advertisement -

శ్రీలీల ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంబిబిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి శ్రీలీల ఒక చిన్న బ్రేక్ తీసుకుంటుంది. వారం రోజులపాటు తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కు దూరంగా ఉండబోతోంది. నిజానికి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటి నుంచే ఇలా అప్పుడప్పుడు తాత్కాలికంగా బ్రేక్స్ తీసుకుంటూ తన చదువును కూడా నెట్టుకొస్తుంది. అసలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈ బ్యూటీ కి చదువుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుందో మరి.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లను టేస్ట్ చేస్తున్న శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఆమె బ్రేక్ తీసుకుంటే ముఖ్యంగా ఇబ్బంది కలగాల్సింది ఈ మూవీ టీంకే. కానీ శ్రీలీల అటు ఈ మూవీ షూటింగ్ ను, తన చదువును జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.

ప్రస్తుతం “గుంటూరు కారం” మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈనెల 21న ఈ సినిమాలోని చివరి సాంగ్ కు సంబంధించిన షూటింగ్ జరగబోతోంది. అయితే ప్రస్తుతం శ్రీలీల తన ఎగ్జామ్స్ కోసం తీసుకున్న బ్రేక్ చూస్తుంటే “గుంటూరు కారం” మూవీ సాంగ్ షూటింగ్ పై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. మరి శ్రీలీల లేకుండానే ఆ పాటను ప్లాన్ చేశారా? అనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు