Anupama Parameswaran: రోజురోజుకి దిగజారిపోతున్న అనుపమ.. కారణం..?

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం అవకాశాలు లేక స్లో అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు సినిమాలలో నటిస్తోంది. ఇక వచ్చే నెలలో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.మరొకవైపు ఒకటి తమిళం, మరొకటి మలయాళం చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇవి తప్పితే మరో సినిమాలో అవకాశం రాలేదు. తాజాగా అవకాశాలు లేక రూట్ మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ అయిపోయిన అనుపమ.. తెలుగులో నితిన్ నటించిన అ ఆ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ సినిమా తర్వాత శతమానం భవతి, కార్తికేయ 2 వంటి చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తర్వాత దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ కిస్ సన్నివేశాలలో నటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు డీజే టిల్లు 2 లో కూడా కాస్త బోల్డ్ గానే నటించిందని సమాచారం. మూవీ నుంచీ కొన్నాళ్లకు ముందు రిలీజ్ అయిన ఒక పాట ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇకపోతే తాజాగా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమయ్యిందట. ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్రూం సన్నివేశాలలో కూడా నటించడానికి సిద్ధమయిందని సమాచారం.

అయితే అవకాశాలు తగ్గుతుండడం వల్లే ఇలా రూట్ మార్చి బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది చూసిన కొంతమంది అవకాశాల కోసం ఏదైనా చేస్తారా అంటూ మండిపడుతుంటే.. మరికొంతమంది మరీ ఇంత దిగజారి పోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే రెమ్యూనరేషన్ లో భాగంగా ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట అనుపమ. ఇకపోతే తన అందంతో నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె మొదటి సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆమె అందానికి ఫిదా అయిన దర్శక నిర్మాతలు కూడా చాలా సినిమాలలోనే అవకాశాలు ఇచ్చారు. కానీ ఆమె తన అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక కరోనా సమయంలో పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో తన తమ్ముడితో కలిసి అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరయింది. ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక ఇలా బోల్డ్ పాత్రలకు ఓకే చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు