WTF First Look : తెగించేసిన నీహారిక… ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత క్రేజీగా మారిపోయింది. ఇప్పటికీ ఆమె హీరోయిన్గా నిడదకుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త సినిమాను ప్రకటించింది. నిహారిక ఫుల్ గ్లామరస్ రోల్ లో కనిపించబోతున్న లేటెస్ట్ మూవీ”వాట్ ద ఫిష్”. “వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజీయర్” అనే హాష్ టాగ్ తో రూపొందుతున్న ఈ మూవీతో వరుణ్ కోరుకొండ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

“వాట్ ద ఫిష్” ఫస్ట్ లుక్ లో నిహారిక గ్లామర్ ఓవర్ డోస్ అయిందేమో అనిపిస్తుంది. పోస్టర్లో నిహారిక గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆమె అష్టలక్ష్మి అకా యష్ అనే పాత్రను పోషిస్తుంది. అల్ట్రా గ్లామరస్ లుక్ లో ఉన్న నిహారిక పొట్టి దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో డాలర్ ఇమేజ్, ఫారిన్ అమ్మాయిలు ఉండడం చూస్తుంటే కథ అంతా విదేశాలలో ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నిహారిక పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర చేయబోతుందని అంటున్నారు. మొత్తానికి నిహారిక ఫస్ట్ టైం ఇంతటి గ్లామరస్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఈ సినిమాతోనైనా ఆమె హీరోయిన్ గా నిలదొక్కు ఉంటుందా? ఇప్పటికైనా ఆమెను మెగా ఫాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అనేవి ఇక్కడ ప్రశ్నలు.

నిహారిక “ఒక మనసు” మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీ తో సహా ఆ తర్వాత ఆమె చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దానికి మెగా ఫ్యాన్స్ కూడా ఒక కారణం. తమ మెగా ప్రిన్స్ ను గ్లామరస్ పాత్రలో చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనేది ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే ఇన్నాళ్లు నిహారిక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకోవడానికి ట్రై చేసింది. కానీ కాలం కలిసి రాకపోవడంతో సినిమాలను పక్కన పెట్టి పెళ్లి చేసుకుంది. కానీ మ్యారేజ్ లైఫ్ లో కూడా నిహారికకు ఎదురుదెబ్బే తగిలింది. మొత్తానికి భర్తకు డివోర్స్ ఇచ్చేసి మళ్లీ సినిమాలపై కాన్సెంట్రేట్ చేసింది నిహారిక. అయితే ముందుగా ఆమె తన నిర్మాణ సంస్థపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత ముడుచుకుని కూర్చుంటే అయ్యేలా లేదని తెగించి గ్లామర్ గా కనిపించడానికి రెడీ అయింది. “వాట్ ద ఫిష్” ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే నిహారిక తీసుకున్న ఈ డెసిషన్ ఆమె కెరీర్ కు ఎంత వరకు ప్లస్ అవుతుంది? అనేది చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు