NTR: లక్ష్మీ ప్రణతి నుంచి ఆ మాట కోసం ఎదురుచూస్తూనే ఉంటా – ఎన్టీఆర్..!

నందమూరి వారసుడిగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. నేడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే . కెరియర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకున్న ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని.. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు . భార్య పిల్లలతో ఎంతో సఖ్యతగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో తన భార్య గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులలో తన భార్య తనతో అసలు మాట్లాడలేదని.. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా వివాహం పెద్దలు కుదుర్చున వివాహం కావడంతో పెళ్లిచూపులకు సాంప్రదాయంగా వెళ్ళాము.. అయితే పెళ్లి చూపులలో లక్ష్మి ప్రణతి ని చూడగానే నచ్చేసింది. ఓకే చెప్పి వచ్చాను . కానీ తనకు నేనంటే ఇష్టమా లేదా అన్న విషయం మాకు తెలియదు.. పెళ్లిచూపులకి, పెళ్ళికి దాదాపు 8 నెలల సమయం ఉందని.. ఈ ఎనిమిది నెలల కాలంలో ఎప్పుడైనా సరే నేను అంటే ఇష్టం అన్న విషయాన్ని ప్రణతి చెబుతుందని ఎదురు చూశాను.. కానీ తను నాకు చెప్పలేదు అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు..

అంతేకాకుండా పెళ్లి తర్వాత నేనంటే ఇష్టం అన్న విషయాన్ని ప్రణతి చెప్పలేదు.. ఇక నేనే అనుమానం వచ్చి నేనంటే నీకు ఇష్టమా? లేక బలవంతంగా పెళ్లి చేశారా? అని అనుమానం వచ్చి అడిగాను. కానీ దానికి తాను సమాధానం చెప్పలేదు.. ఇప్పటికీ తాను నేనంటే ఇష్టం అన్న విషయాన్ని చెప్పలేదు.. తాను చెప్పే ఈ మాట కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు. ఇకపోతే ఆడవాళ్ళ ఆలోచనలను.. వారు ఇష్టాలను తెలుసుకున్నవాడు ఎప్పటికీ పర్ఫెక్ట్ అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ కామెంట్ చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్న విషయాన్ని మాటల ద్వారా చెప్పకపోయినా తన నడవడిక వ్యవహార శైలి ద్వారా ఎప్పటికప్పుడు లక్ష్మీ ప్రణతి తెలియజేస్తూ ఎన్టీఆర్ భార్యగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు