Salaar Release Trailer Talk: మళ్ళీ ఆ మిస్టేక్ చేయలేదులే… ఇది కదా కావాల్సింది !

సలారోడి మాస్ ఫెస్ట్ షురూ అయింది. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” రిలీజ్ ట్రైలర్ ఎట్టకేలకు రానే వచ్చింది. అయితే సెకండ్ ట్రైలర్ విషయంలో ఫస్ట్ ట్రైలర్ కు చేసిన తప్పును మాత్రం రిపీట్ కానివ్వలేదు మేకర్స్. మరి పోస్ట్ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయంలోకి వెళ్తే…

సినీ ప్రేక్షకులందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న సలార్ యాక్షన్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు మేకర్స్. ఇప్పటిదాకా ఈ సినిమాకు అసలు ప్రమోషన్లే చేయలేదు. అయినప్పటికీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒకే అయినప్పటికీ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడన్న కారణం ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ ట్రైలర్ రిలీజ్ కాగా, అది ప్రేక్షకులను నిరాశపరచడంతో తాజాగా అద్భుతమైన యాక్షన్ సీన్లతో ఉన్న కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

గతంలో రిలీజ్ చేసిన ట్రైలర్లో స్టోరీని రివీల్ చేసేసారు మేకర్స్. అయితే అందులో యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ సీన్స్ ఎక్కువగా లేకపోవడం అందరిని నిరాశకు గురి చేసింది. ఈ తాజాగా రిలీజ్ చేసిన రెండవ ట్రైలర్ లో మాత్రం మేకర్స్ ఆ తప్పును రిపీట్ చేయలేదు. ప్రేక్షకులు ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి వాళ్ళ ఆకలిని కొంత చల్లార్చారు. యాక్షన్స్ సన్నివేశాలతో ట్రైలర్ దద్దరిల్లింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో, పవర్ ఫుల్ డైలాగ్ లతో నిండిపోయిన ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు యాక్షన్ ధమాకా అని చెప్పాలి.

- Advertisement -

ఇక “సలార్” కొత్త ట్రైలర్ ను చూసిన నెటిజెన్లు ఇది కదా కావాల్సింది అంటూ ప్రభాస్ మాస్ ఫెస్ట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటిదాకా చిత్ర బృందం ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడంతో ఆందోళనలో ఉన్న అభిమానులు ఈ ట్రైలర్ చూశాక సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్లో దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ల మధ్య ఫ్రెండ్షిప్, ఖాన్సార్ రాజ్యం కోసం జరిగే పోరాటాలు, అలాగే సినిమాలో కావలసినంత యాక్షన్ మసాలా ఉండడం ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచేస్తోంది. ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆత్రుత ఇంకా పెరిగిపోయింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు