Darshan murder case : కన్నడ స్టార్ ప్రియురాలు అరెస్ట్.. నువ్వే కారణం అంటూ పవిత్రపై దర్శన్ దాడి

Darshan murder case : రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ ను పోలీసులు అరెస్టు చేసిన ఘటనలో మరో పరిణామం చోటు చేసుకుంది. అతని ప్రియురాలు పవిత్ర గౌడను తాజాగా అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో ఆమె హస్తం కూడా ఉందా?

పవిత్ర గౌడ అరెస్ట్

పవిత్ర గౌడను ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ మార్కండయ్య ఆమెను కామాక్షి పాళ్య పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పవిత్రతోపాటు ఆమె అక్క కూడా పోలీస్ స్టేషన్‌కి వచ్చింది. ఈ హత్య కేసులో నటుడు దర్శన్ సహా 10 మందిని ఏసీపీ చందన్ బృందం అరెస్టు చేసింది.

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ను మైసూర్‌లోని ఓ హోటల్‌లో అరెస్టు చేయగా, జయన్న కుమారుడు వినయ్‌, కిరణ్‌, మధు, లక్ష్మణ్‌, ఆనంద్‌, రాఘవేంద్ర సహా 10 మందిని అరెస్టు చేశారు. బెంగళూరులో దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైసూరులోని అన్నపూర్ణేశ్వరినగర్ పోలీస్ స్టేషన్‌లో దర్శన్‌ను డీసీపీ గిరీష్, ఏసీపీ చందన్ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు గొడవ చేసే అవకాశం ఉండడంతో అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో కన్నడ పోలిసే స్క్వాడ్‌ను మోహరించారు.

- Advertisement -

రేణుకా స్వామి దర్శన్ అభిమానే

దర్శన చేతిలో హత్యకు గురైన రేణుకా స్వామి ఆయన అభిమానే కావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి మధ్యలోకి పవిత్ర గౌడ రావడంతో, ఆ కోపంతోనే అతను పవిత్ర గౌడకు మెసేజ్ చేసినట్టు సమాచారం. పవిత్ర గౌడకు మెసేజ్ చేస్తున్నాడని తెలుసుకున్న దర్శన్ అతన్ని హత్య చేసినట్లు చెబుతున్నారు.

How Darshan's Aides Trapped Renukaswamy & Brought Him To Bengaluru From Chitradurga? - Oneindia News

జరిగింది ఇదే..

రేణుకా స్వామి హత్యకేసులో దర్శన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయనపై దర్శన్ అభిమానుల సంఘం అధ్యకుడితో సహా కొందరు దాడికి పాల్పడ్డారు. తరువాత హత్య చేసి కాలువలో పడేసి పారిపోయారు. ఇందులో దర్శన్ కూడా ఉన్నాడని అంటున్నారు.

పవిత్రపై దర్శన్ దాడి?

అసలే దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడన్న వార్త శాండల్ వుడ్ ను కుదిపేస్తుంటే తాజాగా మరో షాకింగ్ కథనం వెలుగులోకి వచ్చింది. పవిత్రపై దర్శన్ దాడి చేసినట్లు సమాచారం. హీరో దర్శన్, ప్రముఖ నటి పవిత్ర మధ్య సాన్నిహిత్యం ఉంది. గత పదేళ్లుగా వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలను కూడా షేర్ చేశారు. పవిత్రను వేధించినందుకే రేణుకా స్వామిని దర్శన్ హత్య చేసినట్లు చెబుతున్న నేపథ్యంలో ప్రియురాలిపై ఈ కన్నడ స్టార్ దాడి వ్యవహారం చర్చనీయాంశమైంది.

రేణుకా స్వామి హత్య తర్వాత పవిత్రపై దర్శన్ దాడి చేసినట్లు సమాచారం. నీ వల్లే ఇదంతా జరిగింది అని దర్శన్ అరిచాడని, దాడికి గురైన పవిత్ర బెంగళూరులోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుందని అంటున్నారు. సోమవారం పవిత్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు