Ravi Teja: మాస్ మహారాజా మూవీలో శ్రీ లీల కన్ఫామ్.. అప్డేట్ ఎప్పుడంటే..?

Ravi Teja: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ప్రజెంట్ వర‌స‌ సినిమాలు చేస్తూ సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికే రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల రవితేజ RT75 పేరుతో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే తాజాగా రవితేజ అండ్ శ్రీ లీల కలిసి ఈ మూవీ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణం లో రాబోతున్న ఈ మూవీకు రచయిత భాను ‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Shree Leela Confirmation in Mass Maharaja Movie
Shree Leela Confirmation in Mass Maharaja Movie

ఇక ఈయనకి ఇదే మొట్టమొదటి సినిమా. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు సమాచారం. షూటింగ్ కూడా తొందర్లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీ లీల అండ్ రవితేజ కాంబినేషన్లో ఇప్పటికే ధమాకా మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ జోడీకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు