Ashika Ranganath: అందాలతో అదరహో ‌ అనిపిస్తున్న అషికా రంగనాథ్.. ఆ ఒంపు సొంపులకి ఫిదా అవుతున్న ప్రేక్షకులు..!

Ashika Ranganath: కన్నడ నుంచి వచ్చి తెలుగులో స్థిరపడ్డ ముద్దుగుమ్మలలో అషిక రంగనాథ్ కూడా ఒకరు. అమిగోస్ చిత్రంలో కళ్యాణ్రామ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. ఇక రీసెంట్ గా నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ మూవీతో సూపర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన అందచందాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రజెంట్ ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ఇటీవల చిరంజీవి విశ్వంభరాలో కూడా ఈమె నటించబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Ashika Ranganath, who looks amazing with her beauty
Ashika Ranganath, who looks amazing with her beauty

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా చీరకట్టులో తన స్కిన్ టోన్ తో క్యూట్ నెస్ తో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ ఈ ఫోటోలను చూసిన వారంతా… అచ్చం అప్సరసలాగా ఉన్నావు. నీ అందానికి మేము ఫిదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు