Darshan Murder Case : దర్శన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు… ఎన్నేళ్ల జైలు శిక్ష పడుతుందో తెలుసా?

Darshan Murder Case : కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్య చేశాడనే వార్త సంచలనంగా మారింది. తన సన్నిహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్‌ను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై నమోదైన అభియోగాలు ఏంటి? ఎలాంటి శిక్ష పడబోతోంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరి దర్శన్ కు పడే శిక్ష ఏంటో తెలుసుకుందాం పదండి.

దర్శన్ పై వచ్చిన ఆరోపణలు

చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో నటుడు దర్శన్‌పై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. మొదట రేణుకా స్వామిని కిడ్నాప్ చేసిన కేసు, ఆ తర్వాత గోడౌన్‌లో ఉంచి హత్య చేసి, మురికి కాలువలో పారేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మూడు ఆరోపణలు తీవ్రమైనవే. ఒకవేళ ఆరోపణలు రుజువైతే దర్శన్ చిక్కుల్లో పడినట్టే.

శిక్ష ఏంటి ?

దర్శన్ ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను నాశనం చేయడం) జోడించి కిడ్నాప్ కేసును చేర్చుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కన్నడ నటి రమ్య దర్శన్‌పై చేసిన ఆరోపణలపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల గురించి రీట్వీట్ చేసింది. దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన సెక్షన్లు చూస్తే అది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నాన్-బెయిలబుల్ నేరం, IPC సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదు విధించబడుతుంది. 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు జీవిత ఖైదు తప్పదన్న మాట.

- Advertisement -

ಇದು ಹತ್ತು ವರ್ಷದ ಸಂಬಂಧ" ಎಂದು ದರ್ಶನ್ ಜೊತೆಗಿನ ಫೋಟೊ ಹಂಚಿಕೊಂಡ ಪವಿತ್ರಗೌಡ | Pavithra Gowda revealed photos with Darshan and says 10years of our relationship - Kannada Filmibeat

ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేశారు. జూన్ 9న రేణుకాస్వామి హత్యకు గురయ్యారు. అతన్ని కిడ్నాప్ చేసి దాడి చేశారు. దాడి చేసిన నలుగురు వ్యక్తుల బృందంలో దర్శన్ కూడా ఉన్నట్లు సమాచారం. మృత దేహాన్ని చంపి మురికి గుంటలో పడేసినట్లుగా తెలుస్తోంది. కుక్కలు ఈడ్చుకెళ్లడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత విచారణ చేపట్టగా ముగ్గురు నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. దర్శన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని వాళ్ళే ఒప్పుకున్నారట.

దర్శన్ లాయర్ ఏమంటున్నారు ?

దర్శన్ తరపు లాయర్ మాట్లాడుతూ అతనిపై ఈ తీవ్రమైన కేసు ఇంకా రుజువు కాలేదు. ఇప్పుడు అరెస్టు చేయలేదు. దర్శన్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ హత్య చేసి అరెస్ట్ అయ్యాడని కాదు. విచారణకు ఆయన హాజరయ్యారు. పోలీసులు ఎవరినైనా విచారించవచ్చు. సామాన్యులను కూడా విచారిస్తారు. ఇప్పుడు దర్శన్ విషయంలో కూడా ఇదే జరిగింది అని అన్నారు.

పిలవడం వేరు, అరెస్టు చేయడం వేరు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని దర్శన్ తరపు లాయర్ తెలిపారు. ఈ కేసులో పని చేసే పోలీసులను డిస్టర్బ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పీళ్లకు నోటీసులివ్వాలన్నారు. విచారణ అనేది ఏమాత్రం సమస్య కాదని దర్శన్ అభిమానులకు ధైర్యం చెప్పారు. ఇక దర్శన్ తో పాటే ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు