HBD Bunny vasu : పేరు వెనుక రహస్యం.. ఆయన ఎదిగిన తీరు తెలిస్తే షాక్..!

HBD Bunny vasu.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో , ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక హీరోయిన్ ఇలా ఎవరైనా సరే తాము నటించిన సినిమాలు లేదా దర్శకత్వం వహించిన సినిమాలు లేదా నిర్మించిన సినిమాలు ఇలా.. ఏదైనా సరే వాటి ద్వారా తమకు గుర్తింపు వస్తే మాత్రం వాటి పేర్లను తమ ఇంటి పేరుగా పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. కానీ ఇక్కడ ఒక నిర్మాత తన ఫ్రెండ్ పేరును తన పేరుగా మార్చుకోవడం గమనార్హం.. అలా బన్నీ వాసుకి కూడా ఈ పేరు అలాగే వచ్చింది.. ఇక అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ లో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాసు గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులలో ఒకరు అని చెప్పవచ్చు. ఈయన అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కూడా.. ఈ నేపథ్యంలోనే అందరూ ఈయనను బన్నీ వాసు అంటూ పిలుస్తూ ఉంటారు..

బన్నీ వాసు కెరియర్…

HBD Bunny vasu: The secret behind the name.. Shocking to know the way he grew up..!
HBD Bunny vasu: The secret behind the name.. Shocking to know the way he grew up..!

బన్నీ వాసు మాస్టర్ ఇన్ ఐ.టీ. కోర్స్ నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3D యానిమేషన్ కూడా నేర్చుకున్నారు. ముఖ్యంగా జానీ చిత్రం యొక్క లోగో యానిమేషన్ కోసం అల్లు బాబీ దగ్గర చేరారు.. ఈయన పనిని మెచ్చిన అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబి తన దగ్గర నియమించుకొని గీతా ఆర్ట్స్ లో ఒకరిగా భాగం చేశారు.. ఒక బన్నీ వాసు పాలకొల్లుకు చెందినవారు. గీత ఆర్ట్స్ లో శిక్షకునిగా చేరారు. ఇక తర్వాత యు. వీ.క్రియేషన్స్ అధినేత వంశీతో కలిసి 57 చిత్రాలను గుంటూరు , పశ్చిమగోదావరి జిల్లాలలో పంపిణీ కూడా చేశారు.. అలా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు.. ముఖ్యంగా ఆ చిత్రాలలో పోకిరి, ఆర్య, మగధీర వంటి సినిమాలు కూడా ఉన్నాయి.. చివరిగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసిన వాసు ఆ తర్వాత బన్నీ చిత్రాల నిర్మాణంలో సృజనాత్మక అంశాలలో కూడా పాల్గొనేవారు..

బన్నీ వాసు నిర్మించిన చిత్రాలు..

ఇక ఈయన నిర్మించిన సినిమాల విషయానికి వస్తే.. 2011లో నాగచైతన్య ,తమన్నా జంటగా వచ్చిన 100% లవ్ చిత్రం ద్వారా నిర్మాతగా కెరియర్ మొదలుపెట్టారు.. ఒక ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. 2014లో కొత్తజంట , అదే ఏడాది పిల్ల నువ్వు లేని జీవితం, 2015లో భలే భలే మగాడివోయ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వాసు .. 2016లో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రానికి సహ నిర్మాతగా… 2018 లో వచ్చిన నా పేరు సూర్య సినిమాకి కూడా సహ నిర్మాతగా పనిచేశారు. ఇక తర్వాత 2017లో నెక్స్ట్ నువ్వే, 2018లో గీతాగోవిందం, 2019లో ప్రతిరోజు పండగే, 2021లో చావు కబురు చల్లగా , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 2022లో పక్కా కమర్షియల్, 18 పేజీస్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

బడ నిర్మాతగా బన్నీ వాసు..

ఇక బన్నీ 1981 జూన్ 11న పాలకొల్లు ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు చిన్ననాటి నుండి సినిమాల పైన ఆసక్తి ఉన్న ఈయన నిర్మాణ రంగంలోకి అడుగులు వేసి ప్రస్తుతం టాలీవుడ్లో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ లో భాగం అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు