Anand Deverakonda: ఆనంద్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. వీడియో వైరల్..!

Anand Deverakonda.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ.. ఆ తర్వాత హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు.. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.. కానీ ఇటీవల సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయాడు.. ఇక ప్రస్తుతం గం గం గణేశా సినిమాలో కూడా నటించాడు.. సరికొత్త క్రైమ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఈ సినిమా చాలా బాగా మెప్పించింది.. ప్రస్తుతం ఆనంద్ ఫ్యామిలీతో అమెరికాలో ఉన్నాడు… విజయ్ దేవరకొండ, ఆనంద్ , వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్లారు.. ఇందులో భాగంగానే అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పలు కార్యక్రమాలలో కూడా వీరు పాల్గొన్నారు.

పాట పాడి ఆశ్చర్యపరిచిన ఆనంద్..

Anand Deverakonda: Does Anand have this talent too.. Video viral..!
Anand Deverakonda: Does Anand have this talent too.. Video viral..!

అందులో భాగంగానే ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ పేరిట ఒక ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఇందులో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా.. ఆనంద్ దేవరకొండ తెలుగు వారి ఈవెంట్లో పాట పాడి అదరగొట్టేశాడు.. తన సూపర్ హిట్ సినిమా అయిన బేబీ నుంచి “కంటీ రెప్ప కనుపాప లాగా ఉంటారేమో కడదాకా.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా ” అనే ఎమోషనల్ సాంగ్ ని పాడి అందరి మనసులు దోచుకున్నాడు..ఈ పాట సినిమాలో ఎంత బాగుందో.. ఆనంద్ కూడా అంతే అద్భుతంగా పాడడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోవడమే కాదు ఈలలు, చప్పట్లతో కార్యక్రమానికి రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

భవిష్యత్తులో సింగర్ అయ్యే ఛాన్స్..

ప్రస్తుతం ఆనంద్ అమెరికా ఈవెంట్ లో పాట పాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆనంద్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇంత బాగా పాడగలడా ?అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా నేటిజెన్లు భవిష్యత్తులో ఏదైనా సినిమాలో ఆనంద్ పాట కూడా పాడుతాడేమో అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.. ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలలో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆనంద్ దేవరకొండ కూడా చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఆనంద్ దేవరకొండ సినిమాలు..

ఇక ఆనంద్ దేవరకొండ సినిమాల విషయానికే వస్తే.. 1996 మార్చి 16న హైదరాబాద్లో గోవర్ధనరావు , మాధవి దంపతులకు జన్మించిన ఆనంద్ దేవరకొండ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేసి.. చికాగోలోని లయోలా కాలేజ్ నుండి ఎమ్మెస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అక్కడే కొంతకాలం సాఫ్ట్వేర్ గా పనిచేసిన ఈయన.. 2019లో వచ్చిన దొరసాని సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే తదితర చిత్రాలలో నటించాడు. ఇక అంతే కాదు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాదులోని జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్సలెన్స్ అవార్డుల విభాగంలో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు