Bigg Boss: గత సీజన్ల విన్నర్ల పరిస్థితి ఎలా ఉందంటే..?

టెలివిజన్ రంగంలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నిన్నటితో 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరి ఈ సందర్భంగా గత 6 సీజన్ ల విన్నర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయాలు మరింత వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ముగిసిన బిగ్బాస్ ఏడవ సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మిగతా 6 సీజన్ల కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. తెలుగు సీజన్ 6 విజేతగా రేవంత్ నిలిచాడు. అసలు విజేత శ్రీహాన్ కాగా రూ.40 లక్షల క్యాష్ తీసుకొని శ్రీహాన్ వెనక్కి తగ్గడంతో రన్నర్ గా ఉన్న రేవంత్ ను కప్ వరించింది.

గతంలో సింగర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రేవంత్ అంతకుముందు సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలిచాడు. ఆ తర్వాత బాహుబలి లో మనోహరి పాటతో ఫేమస్ అయిన బిగ్ బాస్ లోకి రాకముందే మంచి గుర్తింపు వచ్చింది. అయితే బిగ్ బాస్ వల్ల రేవంత్ కి ఒరిగిందేమీ లేదు. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు అక్కడక్కడ కనిపించిన రేవంత్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మరెక్కడ కనిపించలేదు.

ఇక బిగ్ బాస్ 5వ సీజన్ విజేతగా వీ . జే.సన్నీ నిలిచారు. టైటిల్ ట్రోఫీతో పాటు రూ .50 లక్షల క్యాష్ ప్రైస్ , షాద్ నగర్ లో ఉన్న సువర్ణభూమి నుంచి రూ .25 లక్షల విలువ చేసే ఫ్లాట్, ఒక టీవీఎస్ బైక్ గెలుపొందారు. ఇక ప్రస్తుతం హీరోగా మారి సన్నీ సినిమాలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు స్టార్ హీరోగా మారాలని పట్టుదలతో ఉన్నారు సన్నీ.

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలవగా… ఒకప్పుడు సినిమాలో హీరోగా కాలం కలిసి రాలేదు. బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం వరల్డ్ టూర్లు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు.. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు కూడా సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చి ఇటీవల రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ వేదికపై కూడా పెర్ఫార్మెన్స్ చేశారు.

బిగ్బాస్ సీజన్ టు విజేతగా కౌశల్ మంద నిలిచారు. ఈ కంటెస్టెంట్ చేసిన హడావిడి బిగ్బాస్ చరిత్రలో ఎవరు చేయలేదు. హౌస్ లోకి వచ్చేముందు బయట తన కంటూ కొంత పీ ఆర్ టీం సెట్ చేసుకొని కౌశల్ ఆర్మీగా దాన్ని పెంచి తెగ హడావిడి చేశాడు. హౌస్ లో తనను వేరు చేస్తున్నారు అన్న సింపతీని బాగా క్యాష్ చేసుకొని ఓట్లు సంపాదించాడు. ఇక ఇతడికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఓపెనింగ్ తప్ప ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం బిజినెస్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు.

ఇక తెలుగు సీజన్ వన్ విన్నర్ గా చరిత్ర సృష్టించిన శివ బాలాజీ అంతకుముందు హీరో రోల్స్ చేసేవాడు ఇక బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ నన్ను చూసుకుంటున్నట్లు సమాచారం.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు