Saindhav: వెంకటేష్ కూతురుగా నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ?

విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన అద్భుతమైన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటాడు. తన సినిమాలకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వెంకటేష్ నటించిన తాజాచిత్రం “సైందవ్”. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా మంచి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు.

ఈ సినిమాలో వెంకటేష్ కి కూతురుగా నటించిన అమ్మాయి తన అందమైన నటనతో ఎంతోమంది అభిమానులను తన వైపుకు తిప్పుకుంది. తన అద్భుతమైన నటనతో, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. సినిమాలో ఈ అమ్మాయి నటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి ఎవరు అని తెగ వెతుకుతున్నారు. ఈ అమ్మాయి పేరు సారా పాలేకర్. సారా ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాకుండా సింగర్, డాన్సర్, మోడల్, వ్లాగర్, డిజిటల్ క్రియేటర్.

ఇలా అన్ని రకాల టాలెంట్లు ఈ అమ్మాయిలు ఉన్నాయి. “సైందవ్” సినిమాలో ఈ అమ్మాయి నటన చూసిన అనంతరం ఈ చిన్నారికి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగులో మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అతి చిన్న వయసులోనే ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారికి సినిమాల్లో మరింత పాపులారిటీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు