Game Changer : ‘రామ్ నందన్ IAS’ పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్స్..

Ram charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “గేమ్ ఛేంజర్” సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ని కూడా కంఫర్మ్ చేసుకోలేదు. రీసెంట్ గా పండగ హాలిడేస్, అలాగే చిరు కి పద్మవిభూషణ్ వచ్చిన సందర్బంగా షూటింగ్ కి కొంత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు.

ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ సినిమా నుండి మాత్రం ఒక పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో నటించిన పూర్ణ సుధాకర్ అనే ఆర్టిస్ట్ రామ్ చరణ్ నటిస్తున్న రామ్ నందన్ IAS మాట్లాడిన ఒక సాలిడ్ డైలాగ్ ని లీక్ చేసారు. విలన్ గ్యాంగ్ లో ఉన్న తమకి రామ్ నందన్ కలెక్టర్ వచ్చి ఇలా అంటాడు. “వెయ్యి ముద్దలు తినే ఏనుగుకి ఒక్క ముద్ద తగ్గితే నష్టమా” ? ఇన్ని రోజులు బాగా సంపాదించుకున్నారు ఇక ఆపేయండి! అని అంటాడు. ప్రస్తుతం నెట్టింట ఈ డైలాగ్ ని వైరల్ చేసే పనిలో పడ్డారు మెగా ఫ్యాన్స్.

- Advertisement -

అయితే నిర్మాత దిల్ రాజు ఇకనైనా కోలుకుని గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని, లేకపోతే ఇలాంటి లీకులు ఎంత కంట్రోల్ చేసినా ఆగవని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొదలై ఇప్పటికే మూడేళ్లు దాటిందంటే సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం అయిందన్నమాటే. పైగా ఇప్పటివరకు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. మరింత లేట్ చేస్తే ఈ సినిమాపై ఉన్న హైప్ తగ్గిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు