Hanuman: ‘చిరు’ సాయం అయింది.. ఇక ‘ధ్రువ’ సాయం కావాలి..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. నిజానికి ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాలు లేవు. అంత స్టార్ క్యాస్ట్ కూడా లేదు. కానీ ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ట్రైలర్, ఇంకా పాటలతో సహా ఆడియన్స్ ని మెప్పించడంతో హనుమన్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగగా, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయి మూవీ మేకర్స్ కి తన సపోర్ట్ ని అందచేశారు.

ఇక హనుమాన్ మూవీ ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నందువల్ల అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా బాలీవుడ్ లో ప్రమోట్ చేసేందుకు రానా సాయంగా వెళ్ళాడు. తనకి బాలీవుడ్ మేకర్స్ తో మంచి సాన్నిహిత్యం ఉండడం వల్ల హిందీలో మార్కెటింగ్ ఈజీ అయింది. ఇక లేటెస్ట్ గా హనుమాన్ టీమ్ కన్నడ నేలపైకి వెళ్ళింది. ఇక అక్కడ కూడా హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేయడానికి కన్నడ స్టార్ ధ్రువ సర్జా ని మేకర్స్ కలవడం జరిగింది.

ఇక కన్నడ లో పెద్ద స్టార్ అయిన ధ్రువ సర్జా హనుమాన్ కి మహాభక్తుడని తెలిసిందే. పైగా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కావడం వల్ల, హనుమంతుని భక్తి మేనమామ నుండే అబ్బింది. ఇక హనుమాన్ మూవీ మేకర్స్ ధ్రువ సర్జా తో మాట్లాడి ఈ చిత్రం ప్రమోషన్ కి సహాయం కోరారు. ఇక ధ్రువ సర్జా కూడా తన గత సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో హనుమన్ రిఫరెన్స్ చూపిస్తూ ఉంటాడు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు