Tollywood: తెలుగు సినిమాలకు కోలీవుడ్ గేట్లు క్లోజ్… సైంధవ్, హనుమాన్ లకు థియేటర్లు లేవ్!

Tollywood:  సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. థియేటర్ల కోసం తెలుగు హీరోలే కొట్టుకుని చస్తుంటే తమిళ సినిమాలు కూడా ఈ సంక్రాంతినే టార్గెట్ చేశాయి. కానీ ప్రస్తుతం సంక్రాంతి సీజన్ లో తమిళ సినిమాలకు తెలుగులో థియేటర్లు దొరకపోవడంతో ఈ సంక్రాంతికి రావలసిన తమిళ సినిమాలన్నీ వెనక్కి తగ్గాయి. అందులో ధనుష్ “కెప్టెన్ మిల్లర్”, శివ కార్తికేయన్ “అయాలాన్” సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ డైరెక్ట్ గా మన తెలుగు సినిమాలపై పడింది. సైంధవ్, హనుమాన్ సినిమాలకు కోలీవుడ్ లో గేట్లు క్లోజ్ అయ్యాయి. అక్కడ ఈ తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకట్లేదని సమాచారం.

ఈ సంక్రాంతికి తెలుగులో మహేష్ బాబు “గుంటూరు కారం”, నాగార్జున “నా సామి రంగ”, వెంకటేష్ “సైంధవ్”తో పాటు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “హనుమాన్” సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలు “కెప్టెన్ మిల్లర్”, “అయాలాన్” సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక వారం ఆలస్యంగా ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. తెలుగు స్ట్రైట్ సినిమాలకే థియేటర్లు దొరకడం సమస్యగా మారడంతో, ఈ డబ్బింగ్ సినిమాలు థియేటర్లు దొరకక పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసులో నుంచి తప్పుకోవడంతో స్ట్రైట్ తెలుగు సినిమాలకు లైన్ అయితే క్లియర్ అయ్యింది కానీ, ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా తమిళంలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు సైంధవ్, హనుమాన్ లపై పడింది అని సమాచారం.

తమ సినిమాలకు టాలీవుడ్లో థియేటర్లు ఇవ్వకపోవడంతో కోపంగా ఉన్న తమిళ చిత్ర నిర్మాతలు తెలుగు సినిమాలకు అక్కడ థియేటర్లు దొరకకుండా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సైంధవ్ హనుమన్ సినిమాలకు ముందుగా అంగీకరించిన వాటికంటే తక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయించాలని వాళ్లు డిసైడ్ అయ్యారట. “హనుమాన్” తమిళ వెర్షన్ కు 40 కంటే తక్కువ థియేటర్లు, “సైంధవ్” మూవీకి అంతకంటే తక్కువ థియేటర్లు మాత్రమే దొరకబోతున్నట్టు సమాచారం. ఇక “గుంటూరు కారం” మూవీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. గతంతో పోలిస్తే మహేష్ బాబు సినిమా ఈసారి తక్కువ థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తమిళ డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు తమ సినిమాలుగా ఓన్ చేసుకుని ఆదరిస్తుంటే, తమిళ తమ్ముళ్లు మాత్రం తెలుగులో హీరోల సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని తెలుగు మూవీ లవర్స్ మండిపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు