Sankranthi Movies : ధూమపానం సినిమాలకు హానికరం కదా? సిగరెట్లతోనే హీరోయిజమా?

Sankranthi Movies : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే డైలాగ్ ను ప్రతిసారి సినిమాకు వెళ్ళినప్పుడల్లా థియేటర్లలో చూస్తూనే ఉంటాం. అలాగే థియేటర్లలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు కచ్చితంగా ధూమపానం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే యాడ్ ను ప్లే చేస్తారు. ఎందుకంటే సిగరెట్లు ఎక్కువగా తాగితే ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని, దానివల్ల వాళ్ళ కుటుంబం ఎలాంటి కష్టాలకు గురవుతుందనే విషయాన్ని జనాలకు తెలియజేయాలన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అలాగే సెలబ్రిటీలు చెబితే వాళ్ల అభిమానులు వింటారు, అలాంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటారు అనే ఆశ. కానీ తాజాగా టాలీవుడ్ లో పుట్టుకొస్తున్న కొత్త ట్రెండ్ చూస్తుంటే ఈ హీరోలంతా సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ముఖ్యంగా మాస్, యాక్షన్ సినిమాలలో హీరోలు సిగరెట్, లేదా బీడీలు కాలుస్తున్న సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన బిగ్గెస్ట్ సినిమాలు జైలర్, అనిమల్ , సలార్ వంటి సినిమాల్లో ఈ ట్రెండ్ కనిపించడంతో నెక్స్ట్ రాబోతున్న సినిమాల మేకర్స్ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. “జైలర్” మూవీలో రజనీకాంత్ సిగరెట్ తాగే సన్నివేశాలు సినిమాపై భారీ ఎఫెక్ట్ ను చూపించాయి. అలాగే ఈ మూవీలో ఒక కీలకమైన సీన్ లో కన్నడ స్టార్ శివరాజ్ బీడీ తాగడం కూడా చూడొచ్చు. మరోవైపు “అనిమల్” మూవీలో రణబీర్ కపూర్ సిగరెట్ తో కనిపించిన సన్నివేశాలు లెక్కలేనన్ని. ఇక “సలార్” ఫైట్ సీక్వెన్స్ లో ప్రభాస్ స్టైలిష్ గా సిగరెట్ తాగిన సీన్ వైరల్ అయింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు కూడా దీన్నే ఫాలో అయ్యారు.

వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాల్లో చిరు, బాలయ్య సిగరెట్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో నిలిచిన “గుంటూరు కారం”, “నా సామి రంగ” సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కావలసినన్ని ఉన్నాయి. సినిమా ప్రమోషన్లలో కూడా హీరోలు బీడీలు లేదా సిగరెట్లు కాలుస్తున్న పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. “గుంటూరు కారం” ట్రైలర్ లో మహేష్ బాబు బీడీలు తాగుతున్న సీన్స్, “నా సామి రంగ” మూవీ టీజర్, పోస్టర్లలో నాగార్జున బీడీ కాలుస్తున్న సీన్స్ హైలెట్ కావడం చూస్తుంటే సిగరెట్ల తోనే హీరోలు ఎక్కువగా ఎలివేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మాస్ అప్పీల్ కోసం హీరోలు సినిమాల ద్వారా ఇలాంటి హానికరమైన అలవాట్లను ప్రోత్సహించడం పట్ల కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను చూసి వాళ్ళ అభిమానులు తప్పుదారి పట్టడం ఖాయం. మరి ధూమపానం సినిమాల్లో నటించే హీరోలకు హానికరం కాదా? సిగరెట్ల తాగితేనే హీరోయిజం ఎలివేట్ అవుతుందా? అనే ప్రశ్నలకు మేకర్స్, హీరోలే సమాధానం చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు