Animal : మూవీ బ్లాక్ బస్టర్… కానీ సందీప్ రెడ్డి వంగాకు మాత్రం ఆ కోరిక తీరలేదు!

సందీప్ రెడ్డి వంగా… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అది మల్టీస్టారర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే సందీప్ సినిమాలో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో, అలాగే ఈ దర్శకుడు కూడా అదే రేంజ్ లో పాపులర్ అవుతూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ టైం లో ఆయన సినిమాలో నటించిన హీరో కంటే ఈ దర్శకుడే హైలెట్ అవుతూ, హీరోలకు పోటీని ఇస్తుంటాడు. ఇక తాజాగా వచ్చిన “యానిమల్” మూవీతో సందీప్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ ఒక్క కోరిక మాత్రం తీరకుండా మిగిలిపోయింది. ఇంతకీ యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగా తీరని కోరిక ఏమిటంటే?

“యానిమల్” సినిమా రెండు వారాలపాటు బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే టాక్ నడిచింది. “యానిమల్” ఫీవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రావడానికి “సలార్” రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా, మరోవైపు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులపై ఇంతటి ఎఫెక్ట్ చూపించిన ఈ మూవీ 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక యానిమల్ మూవీ మూడవ వారం కూడా 58 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి, మొదటి నాలుగు వారాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా చేరిపోయింది. ఆదివారం షారుక్ ఖాన్ నటించిన “డంకి ” మూవీ రిలీజ్ కారణంగా ఈ మూవీ పర్ఫామెన్స్ అనూహ్యంగా డ్రాప్ అయ్యింది. థియేటర్లు తగ్గినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టుకుంది “యానిమల్”. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ 500 కోట్ల మార్కును సులభంగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఈ సినిమా హిందీ వర్షన్ టోటల్ కలెక్షన్స్ ప్రస్తుతానికి 468 కోట్లకు చేరుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో డంకీ, సలార్ సినిమాల ఎఫెక్ట్ పడితే కలెక్షన్స్ మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం “సలార్” పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఎక్కడ చూసినా ఇదే ఫీవర్ కనిపిస్తోంది. కాబట్టి హిందీలో 500 కోట్ల క్లబ్ లో చేరడానికి “యానిమల్”కు కష్టమవుతుంది.

ఇక అనిమల్ మూవీ 500 కోట్ల మార్కును చేరుకోవాలంటే ఇంకా 30 కోట్లకు పైగా రాబటాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అది అసాధ్యం ఏమో అనిపిస్తుంది. నిజానికి యానిమల్ మూవీ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. అయినప్పటికీ ఈ మూవీ 500 కోట్ల మార్క్ ను చేరకోకపోవడం ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగాను నిరాశకు గురి చేసే అంశం అవుతుంది. మరి యానిమల్ మూవీ హిందీ వర్షన్ 500 కోట్ల క్లబ్ లో చేరుతుందా? లేదంటే జస్ట్ మిస్… ఎపిక్ రికార్డ్ మిస్ అయిన సందీప్ రెడ్డి వంగా అనిపించేలా 500 కోట్లకు చేరువదాకా వచ్చి ఆగిపోతుందా అనేది చూడాలి.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు