Prashanth Neel : తారక్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న డైరెక్టర్… పద్ధతి మార్చుకుంటాడా?

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఉన్న అత్యంత టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటారు. “కేజిఎఫ్”తో మొదలైన ప్రశాంత్ స్టైల్ బాక్స్ ఆఫీస్ ఊచకోత “సలార్” మేనియాతో ఇంకా ఎక్కువైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా “సలార్” పేరే వినిపిస్తోంది. దీంతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను తీసే పద్ధతి చూసి తారక్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. మరి వీళ్ళ టెన్షన్ కు కారణం ఏంటి అంటే?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కించే స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి తోడు ఆయన తీసుకునే బ్యాక్ గ్రౌండ్ కలర్స్ సినిమాను చూసిన వాళ్లకు మంచి థ్రిల్ ఫీలింగ్ ఇస్తాయి. కేజిఎఫ్ ఫ్రాంచైజీ సక్సెస్ కావడంలో ప్రశాంత్ నీల్ తీసుకున్న గ్రే బ్యాక్గ్రౌండ్ కీలక పాత్రను పోషించింది అని చెప్పాలి. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకం మొదలు పెట్టింది.

ప్రస్తుతం సలారోడు రికార్డుల వేటలో మునిగిపోయాడు. భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా కూడా గ్రే బ్యాక్ గ్రౌండ్ తోనే వచ్చింది. దీంతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా డార్క్ కలర్ పాలెట్ లోనే ఉంటాయని అంటున్నారు. ఒకవేళ అదే గనక నిజమైతే కేజిఎఫ్, సలార్ సినిమాలను చూశాక మళ్లీ అదే డార్క్ బ్యాగ్రౌండ్ తో ఇంకో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులకు విసుకు పుట్టే అవకాశం ఉంది. ఈ విషయమే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ లో ముంచేసింది.

- Advertisement -

ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో కలిసి చేయబోతున్న విషయం తెలిసిందే. తారక్ సినిమాకు కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సేమ్ ఇలాంటి డార్క్ థీమ్ ఉండే గ్రే కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటే అది సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ డైరెక్టర్ తారక్ సినిమా కోసం వేరే సినిమాటోగ్రాఫిక్ పద్ధతులను ఉపయోగిస్తే బాగుంటుందని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ డార్క్ కలర్ గ్రేడింగ్ అనేది ప్రశాంత్ నీల్ మార్క్ మూవీ అవుతుంది. అది ఈ డైరెక్టర్ శైలికి అద్దం పడుతుంది.

కాబట్టి ఇతర డైరెక్టర్ సినిమాల కన్నా ప్రశాంత్ నీల్ సినిమా ఇంత ఎఫెక్టివ్ గా, డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఆయన తన పద్ధతి మార్చుకొని డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా తీస్తే అది వర్కౌట్ అవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎలాంటి థీమ్ తో తీయబోతున్నాడు? అది ప్రేక్షకులపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు