Salaar : మూవీలో కేక పుట్టించే పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే!

తాజాగా విడుదలైన “సలార్” మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ హిట్ దక్కకపోవడంతో ఈ సినిమాపైనే ప్రభాస్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. మొత్తానికి సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ప్రభాస్ మళ్లీ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సక్సెస్ ను ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రభాస్ హీరోగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్న ప్రధాన పాత్రలో నటించారు. ఇక శృతిహాసన్ హీరోయిన్ పాత్రను పోషించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “సలార్” మూవీ రికార్డుల ఊచకోత కోస్తోంది. ఎక్కడ చూసినా “సలార్” మేనియానే కనిపిస్తోంది. ఇక థియేటర్లలో సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు “సలార్” డైలాగులను మరిచిపోలేకపోతున్నారు.

సినిమాలో పెద్దగా ఫైట్స్ లేకపోయినప్పటికీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. దానికి తోడు ప్రభాస్ కటౌట్ ఉండడం కూడా బాగా కలిసి వచ్చింది. ఇక సినిమాలో ఉన్న డైలాగులు ప్రేక్షకుల చేత థియేటర్లలో కేక పెట్టిస్తున్నాయి. ఈ సినిమాకు హనుమాన్ చౌదరి, డాక్టర్ సూరి, సందీప్ రెడ్డి బండ్ల వంటి రైటర్స్ డైలాగులు రాశారు. మరి ప్రేక్షకులపై అంతగా ఎఫెక్ట్ చూపించిన ఆ పవర్ ఫుల్ డైలాగ్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

1. అప్పుడు ఎవరి మీద చెయ్యి ఎత్తద్దని గీత గీసింది నేనే, ఇప్పుడు ఆ గీత చెరిపేస్తుంది నేనే..
2. ఖాన్సార్ వల్ల చాలామంది కథలు మారాయి, కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం
3. దేవా వీళ్ళు ఆగాలి.. కావాలంటే చేతులు ఎత్తి మొక్కు, లేదంటే ఎత్తిన చేతిని నరుకు
4. ఆ నివురు గప్పిన నిప్పుకి గాలి తగలాలి, దాని వేడి తెలియాలి
5. ఖాన్సార్ క సలార్, వరద రాజ్ మన్నార్ క సలార్, సలార్ దేవరథ
6. కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది, ఈ కథను తలచుకుంటేనే భయమేస్తుంది
7. దేవాలయాలు కట్టేది మతం వ్యాపించడానికి, రాజ్యాలు పాలించేది వారసత్వం వ్యాపించడానికి, ఖాన్సార్ ని నిర్మించింది కేవలం ఒకే ఒకటి వ్యాపించడానికి… అదే భయం
8. అతని స్థాయి కాపరి అయినా వైఖరి ఎప్పుడూ దొరలానే ఉంటుంది
9. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి… బయటకు ఎవడు పోతాడో అని కాదు, లోపలికి ఎవడు వస్తాడో అని
10. ఖాన్సార్ లో క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఏమీ లెక్కబెట్టలేము… అందుకే లెక్క పట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను
11. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా
12. ఖాన్ సార్ ఎరుపెక్కాలా

ఇలాంటి ఒళ్ళు గగుర్పాటుచే ఎన్నో పవర్ ఫుల్ డైలాగులు ఇంకా సినిమాలో ఉన్నాయి. వాటిని సినిమాలో చూసి ఎంజాయ్ చేయండి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, the latest Kollywood news, Movie Reviews and ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip in Tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు