Samantha: ఒక్క పూట భోజనం కోసం అన్ని పాట్లు.. సమంత ఎమోషనల్ కామెంట్స్..!

Samantha: సాధారణంగా సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో అవస్థలు పడ్డారు. అయితే అందులో కొంతమంది మరీ అధ్వానమైన జీవితాన్ని గడిపారని తెలిసి.. అభిమానులు మరింత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కోవకే చెందింది ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. ఒక్క పూట భోజనమే కష్టంగా ఉండే రోజులలో చదువుకోలేని పరిస్థితి.. ఇలా ఎన్నో కష్టాలను చవిచూసింది. తాజాగా తన బాధలన్నింటినీ చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమంత.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ పలు ఈవెంట్లలో పాల్గొంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న సమంత. తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించింది. సమంత ఎప్పుడూ ఎనేర్జిటిక్ గా ఇతరులకు ఇన్స్పిరేషన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె చేసే సినిమాలు.. వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే అందరూ ఆమెని స్ట్రాంగ్ విమెన్ అని చెబుతూ ఉంటారు. అలాంటి ఈమె తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో రీసెంట్గా తెలియజేసింది.

సమంత తన బాల్య జీవితం గురించి మాట్లాడుతూ.. గతంలో ఒక్క పూట భోజనం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. తన తల్లిదండ్రులు తనను చదువుకోవాలని ప్రోత్సహిస్తూనే వచ్చారని తెలిపింది. అయితే ఆర్థిక స్థోమత లేక అప్పట్లో ఉన్నత చదువులు చదవలేక పోయినట్లు తెలిపింది సమంత.. కుటుంబం కోసం ఏ పని దొరికిన చేసేదానిని.. చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగాలు కూడా చేశాను.. అందులో ఒకటి ఒక స్టార్ హోటల్లో రూ .500 నెల జీతానికి కూడా పనిచేశాను. ఇక అదే నా మొదటి సంపాదన.. ఇలా ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయింది. దీంతో సమంత మాటలకు అభిమానులు కూడా భావోద్వేగమవుతున్నారు.

- Advertisement -

ఇకపోతే సమంతను హీరోయిన్ గా ఎదిగినా కూడా వ్యక్తిగతంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నాగచైతన్యతో పెళ్లి , పెటాకులు వెంటనే అనారోగ్య పాలవడం.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఆమె ఎదుర్కొన్నారు. ఇక అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టులను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు సమంత.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు