Ramcharan: ‘నాయక్’ కలకత్తాలో అడుగుపెట్టి 11ఏళ్లయింది…

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు అందుకున్నాడు. మగధీర తర్వాత రామ్ చరణ్ క్రేజ్ వంద రెట్లు పెరగగా, ఆ తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా ప్రేక్షకులకి అర్ధం కాక అప్పట్లో ప్లాప్ అయింది. ఆ తర్వాత రచ్చ సినిమా బ్లాక్ బస్టర్ తో రామ్ చరణ్ బౌన్స్ బ్యాక్ అయినా, కంటెంట్ పరంగా అది యావరేజ్ సినిమా. ఆ తర్వాత వచ్చిందే “నాయక్” సినిమా. 2013 జనవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా రామ్ చరణ్ ని ఓ మాస్ హీరోగా నిలబెట్టింది. నేటితో నాయక్ రిలీజ్ అయ్యి 11ఏళ్ళు పూర్తవగా, ఈ సినిమా గురించి ఆ రోజుల్లో జరిగిన హంగామా, ఆడియన్స్ కి తెలియని లెక్కలు చాలా ఉన్నాయి.. అందులో కొన్నిటిపై ఓ లుక్కేద్దాం..

రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మించాడు. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా లో రామ్ చరణ్ ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేసాడు. కలకత్తా కి చెందిన సిద్ధార్థ్ నాయక్ లీడర్ గా ఎలా ఎదిగాడు.. మధ్యలో చెర్రీ కి నాయక్ కి సంబంధం ఏంటన్నదే కథ. ఇక ఈ సినిమా కథ పరంగా యావరేజ్ గా ఉన్నా, వివి వినాయక్ తన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మెప్పించాడు.

సంక్రాంతి బరిలో ఫస్ట్ టైం నిలిచిన రామ్ చరణ్ ఎదురుగా, భారీ మల్టీ స్టారర్ అయిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాకి ధీటుగా నాయక్ కలెక్షన్లు రాబట్టాడు. నాయక్ లో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టగా, లుక్స్ పరంగా అంతగా ఆకట్టుకోలేక పోయాడు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియా లో కూడా బాగా ట్రోలింగ్ జరిగింది. ఇక అప్పట్లో నాయక్ కమర్షియల్ గా భారీ కలెక్షన్లు సాధించి బయ్యర్లకి భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నాయక్ బాక్స్ ఆఫీస్ వద్ద 47 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అవగా, అప్పటికి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఆల్ టైం 6th ప్లేస్ లో నిలిచింది.

- Advertisement -

అయితే తెలుగు రాష్ట్రాల్లో నాయక్ సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా రాగా, SVSCకి మూవీ ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రావడం వల్ల వరల్డ్ వైడ్ లెక్కల ప్రకారం నాయక్ కంటే 4 కోట్లు ఎక్కువగా 51 కోట్లు రాబట్టింది. దీనిపై అప్పట్లో మహేష్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గట్టి గొడవే జరిగింది. ఇక ఈ సినిమా నుండే పోసాని కృష్ణ మురళి ఇండస్ట్రీ లో మంచి కమెడియన్ గా ఆఫర్లు అందుకున్నాడు.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాగా ఆ రోజుల్లో రామ్ చరణ్ పవన్ ముందు మీడియాని ఉద్దేశించి మాట్లాడడం సంచలనం.. అప్పట్లోనే రామ్ చరణ్ కి ముక్కు మీద కోపం అని, పెద్దల పట్ల గౌరవం లేదని, దాసరి నారాయణరావు ని ఇరికిస్తూ, వ్యక్తిగతంగా కూడా కొన్ని తప్పుడు రాతలు పలు సోషల్ మీడియా వాళ్ళు రాయడం జరిగింది.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు