Mokshagna: తండ్రి బాటలో మోక్షజ్ఞ.. వర్కౌట్ అవుతుందా..?

Mokshagna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ అందుకోవడమే కాదు యంగ్ హీరోలకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా నట వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య స్వయంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఏడాది ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ మూవీకి ఎవరు డైరెక్షన్ చేస్తారు? ఎలాంటి కథ ఉంటుంది అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది.

అయితే తాజాగా ఫిలిం సర్కిల్లో మోక్షజ్ఞ నటించబోయే సినిమా ఇదే అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బాలయ్య.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ సినిమా వచ్చి భారీ విజయం అందుకోగా ఇప్పుడు అఖండ 2 కూడా త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఇందులో పవర్ ఫుల్ ఎపిసోడ్ ఉందని.. బోయపాటి ఒక రేంజ్ లో మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ రెడీ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ అఖండ 2 లో నటిస్తున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించక పోయినా.. బోయపాటి డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అంటున్నారు. అంతేకాదు బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ నటిస్తే చూడాలన్న ఆసక్తి రోజు రోజుకీ అభిమానులలో పెరిగిపోతుంది.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. తండ్రి బాటలోనే మోక్షజ్ఞ నడుస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటవారుసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ కూడా మొదట ఎన్టీఆర్ సినిమాలలో గెస్ట్ రోల్స్ చేశాడు. ఆ తర్వాతే బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే సెంటిమెంటును మోక్షజ్ఞ ఫాలో అవుతున్నాడని.. ఇండస్ట్రీలోకి అలా గెస్ట్ రోల్ లో వచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తేనే సక్సెస్ అవుతాడని అంటున్నారు. మరి మోక్షజ్ఞ కి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు