Annapoorni: లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తోంది అంటూ ఎఫ్ఐఆర్ ఫైల్… ఈ గొడవేదో రిలీజ్ ముందు జరిగితే బాగుండేది!

Annapoorni:  లేడీ సూపర్ స్టార్ నయనతార తన కొత్త చిత్రంతో చిక్కుల్లో పడింది. ఈ బ్యూటీపై తాజాగా హిందూ వాదులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా నయనతార లవ్ జిహాదీని ప్రోత్సహిస్తుంది అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటి? ఆమె కొత్త సినిమాలో అంతగా కంటెంట్ ఏముంది? అనే వివరాల్లోకి వెళితే…

సౌత్ లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార మొదటి ప్లేస్ లో ఉంది. ఈ బ్యూటీ తాజాగా “అన్నపూర్ణి” అనే మూవీతో తన కెరీర్లో 75 సినిమాలను పూర్తి చేసిన ఘనతను దక్కించుకుంది. కానీ ఈ మూవీ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా, జై హీరోగా నటించగా, పాపులర్ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రను పోషించారు. “జవాన్” వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్న నయనతార నుంచి వస్తున్న ఈ చిన్న సినిమా మంచి అంచనాలతో 2023 డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా “అన్నపూర్ణి” మూవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ విమర్శలు కాస్తా తీవ్ర వివాదానికి తెరతీసాయి. దీంతో నయనతార “అన్నపూర్ణి” మూవీతో ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది.

ఈ మూవీలో లవ్ జిహాదీని ప్రోత్సహించి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ముంబైలోని ఎల్టి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ హీరోయిన్ నయనతారతో పాటు “అన్నపూర్ణి” చిత్ర బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో హీరో జై, డైరెక్టర్ నీలేష్ కృష్ణతో పాటు నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయంకా, జి స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీఫ్ పటేల్, నెట్ ఫ్లిక్స్ ఇండియా హెడ్ మౌనిక షెర్గిల్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాపై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా, “అన్నపూర్ణి” మూవీని బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

రాముడు మాంసం తినేవాడని హీరో జై చెప్పే సన్నివేశంతో వాల్మీకి రామాయణాన్ని తప్పుగా చిత్రీకరించారని, వంటల పోటీలో పాల్గొనే ముందు నయనతార నమాజ్ చేయడం, సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించడం, ఆమె నాన్ వెజ్ వంట వండడం తదితర సన్నివేశాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ వివాదం కారణంగా “అన్నపూర్ణి” మూవీకి మరింత పబ్లిసిటీ పెరుగుతుంది. అసలు ఈ మూవీలో అంత కాంట్రవర్షియల్ కంటెంట్ ఏముందా అని నెట్ ఫ్లిక్స్ లో మూవీని చూడడానికి జనాలు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే నిజానికి ఈ వివాదం సినిమా రిలీజ్ కి ముందు జరిగి ఉంటే బాగుండేది. కనీసం “అన్నపూర్ణి” మూవీకి ఫ్రీ పబ్లిసిటీ అయినా దక్కి యావరేజ్ గా నిలిచేది. మరి ఇప్పుడు ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు